Comedian Raghu: కమెడియన్ రఘు కూతుళ్లను ఎప్పుడైనా చూశారా..? ఇద్దరూ ఎంత క్యూట్‏గా ఉన్నారో..

0
37
Raghu

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది కమెడియన్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. తమ కామెడీ టైమింగ్ తో జనాల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. కామెడీ పంచులు, యాస, మేనరిజంతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎంఎస్ నారాయణ, వేణు మాదవ్, ఏవీఎస్, బ్రహ్మానందం, అలీ ఇలా చెప్పుకుంటే ఎంతో మంది హాస్య నటులు తెరపై తమ నటనతో నవ్వులు పూయించారు. అలాంటి వారిలో రఘు కారుమంచి ఒకరు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. డిఫరెంట్ మేనరిజంతో అందరికీ దగ్గరయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ఆది మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు రఘు. ఆ తర్వాత పలు చిత్రాల్లలో నటించి అలరించారు. తారక్ నటించిన అదుర్స్ సినిమాతో రఘుకు మరింత పాపులారిటీ వచ్చింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఫేమస్ అయిన రఘు.. సినిమాల్లోకి రావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. డైరెక్టర్ వివి వినాయక్ తో ఉన్న స్నేహబంధం కారణంగా ఎన్టీఆర్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. మొదటి సినిమా అది చిత్రంతో నవ్వులు పూయించిన రఘు.. ఆ తర్వాత అదుర్స్ సినిమాలో తన కామెడీ డైలాగ్స్, మేనరిజంతో పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో తెలుగు సినీ ప్రియులకు రఘు పేరు రిజిసర్ అయ్యింది. సినిమాల్లో నటించిన రఘు ఆ తర్వాత కొన్నాళ్లు జబర్దస్త్ కామెడీ షోలో కనిపించాడు. అలాగే సినిమాల్లోనూ నటించి అలరించాడు. ఇప్పటివరకు దాదాపు రూ.200పైగా సినిమాల్లో నటించాడు. ఇదిలా ఉంటే.. రఘు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియవు.

Raghu

Raghu

తెనాలికి చెందిన రఘు హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు. ఇక్కడే ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. రఘుకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద కూతురు పేరు స్వప్నిక, చిన్న కూతురు పేరు తేజస్వీ. చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే రఘు.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తాజాగా తన ఫ్యామిలీ, కూతుళ్లతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. రఘు కూతురు ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here