Chandrabose: తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!

0
28
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!

ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల సుభాస్ చంద్రబోస్ గొప్ప మనసును చాటుకున్నారు. గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తన సొంతూరులో ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకున్నారు. ఇక తన సాహిత్యంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన చంద్రబోస్ ట్రిపుల్ ఆర్ మూవీలో రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చిన సందర్భంగా .. చంద్ర బోస్ తన సొంతూరు అయిన జయశంకర్ భూపాల పల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలోని గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు. చల్లగరిగె ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలకు ముగ్ధుడైన ఆయన అక్కడ ఆస్కార్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు చంద్రబోస్‌.

గ్రామంలో ఇది వరకు ఉన్న పాత గ్రంథాలయాన్ని తొలగించి 36 లక్షలతో కొత్త భవనాన్ని చంద్రబోస్ నిర్మించారు. జులై 04న ఈ ఆస్కార్ గ్రంథాయాన్ని ప్రారంభించారు. భూపాలపల్ల ఎమ్మెల్యే గండ్ర త్యనారాయణరావు, చంద్రబోస్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. చంద్రబోస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడనే కామెంట్ నెట్టింట వస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here