Brahmamudi, July 9th Episode: అనామిక ఫొటోలను తగలబెట్టిన కళ్యాణ్.. చిచ్చు రాజేసిన రుద్రాణి!

0
22
అనామిక ఫొటోలను తగలబెట్టిన కళ్యాణ్.. చిచ్చు రాజేసిన రుద్రాణి!

ఈ రోజు బ్రహ్మముడి సీరియస్‌లో.. కావ్యతో అనామిక అన్న మాటల గురించి తలుచుకుంటాడు కళ్యాణ్. అవి గుర్తు చేసుకుంటూ బాధ పడిపోతాడు. అలాగే కళ్యాణ్‌కు జరిగిన అవమానం కూడా తలుచుకుంటాడు. అవన్నీ గుర్తుకు తెచ్చుకుని తట్టుకోలేక పోతాడు. తన పెళ్లి ఫొటోలు తీసుకుని బయటకు వచ్చి కాల్చేస్తాడు. అప్పుడే కావ్య కళ్యాణ్‌ని వెతుక్కుంటూ వస్తాడు. ఫోటోలు కాల్చేసి మంచి పని చేశారు. ఈ ఫొటోలు చూసి ఉంటే అనామిక చేసిన అన్యాయమే గుర్తుకు వచ్చి బాధ పడుతూంటారు. దీంతో కన్నీళ్లు తుడుచుకుంటాడు కళ్యాణ్. భోజనానికి రమ్మని, అందరు తన కోసమే చూస్తున్నామని కావ్య అంటుంది. నాకు తినాలి లేదని కళ్యాణ్ చెప్తాడు. మీ కోసం కాకపోయినా.. మా కోసమన్నా తినాలి. మీరు తినకపోతే అక్కడ అందరూ కడుపు మాడ్చుకుని ఉంటారు రండి అని కావ్య తీసుకెళ్తుంది.

రుద్రాణి చిచ్చు..

అప్పటికే కళ్యాణ్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అన్నం వడ్డించినా కళ్యాణ్ తినకుండా చూస్తాడు. జరిగిన దానిలో నీ తప్పు ఏమీ లేదని అందరికీ తెలిసింది కదా.. ఇంకా ఎందుకు దాని గురించే ఆలోచిస్తావ్. అదొక పీడకల అని మర్చిపో అని అపర్ణ అంటుంది. మన కుటుంబంలో విడాకులు మొదటి సారి జరిగాయి. అయినా ఎవరం బాధ పడటం లేదు. నువ్వు బాధ పడకురా అని పెద్దావిడ అంటుంది. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా ఆ బాధ ఉంటుందని స్వప్న అంటుంది. అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండురా. ఇక నుంచి ఎవరం అనామిక పేరే తీసుకురాం సరేనా అని ధాన్య లక్ష్మి అంటుంది. అయ్యో చిన్న అన్నయ్య ఇక్కడ సమస్య అది కాదు.. అనామికకు విడాకులు ఇచ్చిన దాని గురించి వాడు బాధ పడటం లేదు. అప్పూకి జరిగిన అన్యాయం గురించి ఆలోచిస్తున్నాడని రుద్రాణి పుల్లలు పెడుతుంది. దీంతో స్వప్న, కావ్యలు తిడతారు.

నీ వల్లే అనామిక వెళ్లిపోయింది..

రాజ్ కూడా మీకు సంస్కారం లేదని రుద్రాణి, రాహుల్‌ని అంటాడు. వాడి జీవితం ఇలా కావడానికి అప్పూనే కారణం కాదని ధాన్య లక్ష్మిని చెప్పమనండని రుద్రాణి అంటుంది. ఏరా రుద్రాణి చెప్పింది నిజమా.. నువ్వు ఇంకా అప్పూ గురించే ఆలోచిస్తున్నావా? ఇంత జరిగినా నువ్వు ఇంకా ఆ దరిద్రాన్ని గుర్తు చేసుకుంటున్నావా? అని ధాన్య లక్ష్మి అంటే.. తప్పేంటి? ఇన్ని రోజులూ అనామిక అని అని వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమె స్థానంలో నువ్వు మొదలు పెట్టాలి అనుకుంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? అని కళ్యాణ్ అంటాడు. దీంతో ప్రకాశం ధాన్య లక్ష్మిని తిడతాడు. ఏంటి అందరూ నన్ను అంటున్నారు. అనామిక వెళ్లిపోయింది అప్పూ వల్లనే కదా అని ధాన్య లక్ష్మి అంటే.. అనామిక వెళ్లిపోయింది అప్పూ వల్ల కాదు.. నీ మూలంగా నా కొడుకు అలాంటి వాడు కాదని బుద్ధి చెప్పి ఉంటే తను మనిషిగా మారేదని కళ్యాణ్ అంటాడు.

ఇవి కూడా చదవండి

మీరు అసలు మనుషులేనా..

నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన అప్పూని వెనకేసుకు రాకు అని ధాన్యం అంటే.. ఆగు నీతో మాట్లాడను అమ్మా.. మీరు ఇక జీవితంలో ఎదగలేరు. నన్ను తిట్టి.. ఇంట్లో వాళ్లను తిట్టి.. అప్పూని తిట్టి ఇంత దూరం చేశారు. వాళ్లు మధ్య తరగతి మనుషులు అమ్మా.. వాళ్ల ఇల్లు వీధిలోనే ఉంటుంది. చుట్టు ప్రక్కల వాళ్లు వచ్చి.. నీ కూతురు హోటల్‌లో దొరికిపోయింది కదా.. అని అంటుంటే వాళ్లు ఎలా భరిస్తారో ఆలోచించావా? ఆమె కూడా ఒక ఆడపిల్లనే. ఇప్పుడు చెప్తున్నా అప్పూ జీవితం బాగు పడే వరకూ నేను ఇలానే ఆలోచిస్తాను అని భోజనం తినడం మానేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ధాన్య లక్ష్మి కావ్యని తిడుతుంది. బాగానే అర్థం చేసుకున్నావు ధాన్య లక్ష్మి. నువ్వు నీ భర్తని, కోడల్ని, కొడుకును బాగానే అర్థం చేసుకున్నావు. నా కోడల్ని ఇంకా బాగా అర్థం చేసుకున్నావు. ఛీ ఏం మనిషివి నువ్వు. అసలు నువ్వు తల్లివేనా? వెళ్లు అని తిడుతుంది అపర్ణ. సరిపోయిందా.. మీకు కావాల్సిందే జరిగిందా.. మీరు అసలు మనుషులేనా అని స్వప్న రుద్రాణి, రాహుల్‌‌లను తిడుతుంది.

కళ్యాణ్‌కు కావ్య ఓదార్పు..

ఆ తర్వాత కళ్యాణ్ గదికి వచ్చి కోపంగా ఉంటాడు. అప్పుడే కావ్య వచ్చి.. ఎందుకు ఇంత ఆవేశం అని కావ్య అంటే.. నా గుండె ఎంత మండి పోతుందో తెలుసా అని కళ్యాణ్ అంటాడు. మీ మనసును కష్ట పెట్టుకోవడం అవసరమా? అని కావ్య అంటుంది. మా అమ్మ ఏం మాట్లాడిందో విన్నారు కదా.. ఇంకా నాదే తప్పు అంటుందని కళ్యాణ్ బాధ పడతాడు. మీరు ఎదిగినంత ఎత్తుగా అందరూ ఎదగాలంటే సాధ్యం కాదు కదా.. అని కావ్య అంటే.. ఇంత జరిగింది. ఇందులో అప్పూ తప్పు లేదని కళ్యాణ్ అంటాడు. మీరు నిర్దోషిలని కోర్టులో రుజువు అయ్యింది కదా.. చివరికి అనామిక జైలుకు వెళ్లింది కదా.. అప్పూ తప్పు లేదని అందరికీ తెలుసు కదా.. ఎవరు ఏం మాట్లాడుకుంటే మనకు ఎందుకు? అప్పూ ఆడపిల్లే కానీ అందరి లాంటి ఆడ పిల్ల కాదు. ఏ తప్పూ చేయలేనప్పుడు ఎందుకు భయ పడాలి అనే మనస్తత్వం. కాబట్టి తొందరలోనే కోలుకుంటుందని కావ్య అంటుంది. దీంతో కళ్యాణ్ కాస్త కుదుట పడతాడు.

కళ్యాణ్ గురించి కావ్య, రాజ్‌ల మధ్య రచ్చ..

ఆ తర్వాత రాజ్ గదిలోకి వస్తుంది కావ్య. కళ్యాణ్‌తో మాట్లాడటానికి వచ్చావా అని రాజ్ అంటే.. అవును.. చాలా ఆవేశంగా ఉన్నాడని కావ్య అంటుంది. సరే అప్పూ సంతోషంగా ఉంటే వాడిలో మార్పు వస్తుందేమో.. అప్పూ కోసం నేను ఏమన్నా చేయగలనా అని రాజ్ అంటాడు. నేనూ, అప్పూ ఒకటే. మాకు ఒకరు సహాయం చేస్తే నచ్చదు అని కావ్య అంటే.. దీన్నే పొగరు అంటారని రాజ్ అంటాడు. ఆహా.. మా ఊళ్లో ఆత్మాభిమానం అని అంటారని కావ్య అంటుంది. ఇక రాజ్, కళ్యాణ్‌లు ఇద్దరూ కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here