Thursday, November 7, 2024
Google search engine
HomeUncategorizedBrahmamudi, July 8th Episode: జైలుకి అనామిక.. కళ్యాణ్, అప్పూలు కలవడానికి వీలు లేదు!

Brahmamudi, July 8th Episode: జైలుకి అనామిక.. కళ్యాణ్, అప్పూలు కలవడానికి వీలు లేదు!

Brahmamudi, July 8th Episode: జైలుకి అనామిక.. కళ్యాణ్, అప్పూలు కలవడానికి వీలు లేదు!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. సాక్ష్యం చెప్పడానికి కావ్యని లాయర్ పిలుస్తాడు దీంతో కావ్య బోనులో నిల్చుని ఉంటుంది. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లోనే ఆ సాక్ష్యం బయటకు చూపించమని లాయర్ గారికి చెప్పాను అని కావ్య అంటుంది. ఇక లాయర్ ఇచ్చిన వీడియోను కనెక్ట్ చేస్తారు. ఆ వీడియో కోర్టలో అందరూ చూస్తారు. అందులో కావ్యతో అనామిక మాట్లాడినదంతా వస్తుంది. చట్టాలన్నీ అనుకూలంగా ఉన్నాయని కొంత మంది ఆడవాళ్లు.. భర్త మీద అనవసరంగా కోర్టుకు లాగుతున్నారు. ఈ కేసు చివరికి ఎలాంటి మలుపు తిరుగుతుందో అందరికీ అర్థమైంది. స్నేహితురాలిగా ఉన్న అప్పూపై కేసు పెట్టింది ఈ అనామిక. దుగ్గిరాల కుటుంబం పరువు అంతా మర్చిపోయి.. సమాజం ముందు దోషులుగా నిలబెట్టింది. కాబట్టి చట్టాన్ని, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ఈ అనామికకు కఠినమైన శిక్ష వేయాలి.

అనామిక జైలుకి.. అప్పూకి నష్ట పరిహారం..

ఒక ఆడపిల్ల మీద చెరగని మచ్చ వేసినందుకు.. పరువు నష్టం కింద జరిమానా విధించాలి. అలాగే దుగ్గిరాల కుటుంబానికి కూడా పరువు నష్టం కింద జరిమానా విధించాలని కోరుతున్నా. అలాగే విడాకులు కూడా ఇప్పించాలని కళ్యాణ్ తరపు లాయర్ కోరతాడు. సాక్ష్యాలను, ఆధారాలను పరిశీలించిన మీదట.. ఇది ఉద్దేశ పూర్వంగానే.. అనామిక పెట్టిన కేసు అని నిర్థారించడం జరిగింది. ముద్దాయి కళ్యాణ్ ని మానసికంగా వేధించినందుకు అనామికను కోర్టు తీవ్రంగా మందలిస్తుంది. అలాగే అప్పూ కుటుంబానికి పరువు నష్ట పరిహారంగా లక్ష రూపాయలు చెల్లించాలి. అలాగే కళ్యాణ్ కుటుంబానికి కూడా రూ.2 లక్షల నష్ట పరిహారాన్ని చెల్లించాలని, విడాకులను కూడా ఇప్పించాలని కోర్టు ఆదేశిస్తుంది. చట్టాన్ని తప్పుదోవ పట్టించినందుకు అనామికకు 15 రోజుల కఠిన శిక్ష విధించాలని కోర్టు ఆదేశించిందని జడ్జి తీర్పు ఇస్తుంది. దీంతో అనామిక, ఆమె పేరెంట్స్ షాక్ అవుతారు. కావ్య, రాజ్ ఫ్యామిలీ వాళ్లు సంతోషిస్తారు.

మమ్మల్ని కలవద్దు బాబు.. ఇక నుంచి దూరంగా ఉండు..

అనామికను పోలీసులు తీసుకెళ్తారు. అనామికా.. నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు తప్పు చేస్తున్నావ్. ఇది సరైన పద్దతి కాదని. కానీ నువ్వు తప్పుడు దారిలో వెళ్లావు. అహంకారంతో కళ్లు నెత్తికెక్కి నీ కాపురాన్ని నువ్వే సర్వ నాశనం చేసుకున్నావు. కనీసం ఇప్పుడైనా మంచిగా ఉండటానికి ప్రయత్నించు అని కావ్య అంటుంది. ఛీ అసలు నువ్వు ఆడదానివేనా.. నీ వల్ల ఒక మంచి ఫ్యామిలీ మీద నిందలు వేశాం. మీ లాంటి ఆడవాళ్ల వల్ల.. అన్యాయం జరిగిన ఆడవాళ్లను న్యాయం చేయలేక పోతున్నామని మహిళా సంఘ అధ్యక్షురాలు ఝాన్సీ అంటుంది. అప్పూ మా ఫ్యామిలీ గొడవల్లోకి నిన్ను లాగి.. చాలా ఇబ్బంది పెట్టాం సారీ అని కళ్యాణ్ అంటే.. ఇక ఇప్పటి వరకూ జరిగింది చాలు బాబు. ఇకనైనా మమ్మల్ని వదిలేయ్. దయచేసి మిమ్మల్ని ఎప్పుడూ కలవడానికి రావద్దు అని కనకం చెప్పి వెళ్లి పోతుంది.

కడిగి పారేసిన కనకం..

ఇక ఆ తర్వాత కనకం ఫ్యామిలీ ఇంటికి వస్తారు. అప్పుడే పక్కనున్న అమ్మలక్కలు వచ్చి.. ఏంటి కనకం ఏమైంది? అని అడుగుతారు. కనకం నిజం చెప్పే లోగానే.. ఏది పడితే అది వాగుతూ ఉంటారు. ఇంత పెద్ద నింద పడ్డాక అప్పూ పెళ్లి జరుగుతుందా? అని ఎగతాళి చేస్తారు. దీంతో కనకం తన స్టైల్‌లో వార్నింగ్ ఇస్తుంది. అన్ని నిజాలూ బయటకు వచ్చాయి. నా కూతురు నిప్పు అని కోర్టులోని అందరి ముందూ తీర్పు ఇచ్చారు. ఆ అనామికకు శిక్ష కూడా వేశారని అంటుంది. వాళ్లను పట్టుకుని ఎడాపెడా వాయిం చేస్తుంది.

కావ్య, రాజ్‌ల రొమాన్స్..

ఈ సీన్ కట్ చేస్తే.. కావ్య గదిలో ఉంటుంది. కావ్యని చూసిన రాజ్.. ఒక్కసారిగా వెళ్లి ఎత్తుకుని గిరా గిరా తిప్పుతూ ఐలవ్ యూ అని చెప్తాడు. కానీ అది కల. ఈ లోపు వెనుక నుంచి ఇందిరా దేవి వస్తుంది. ఏంట్రా సంగతి నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్? అని అడుగుతుంది. నీ పెళ్లాన్ని నీ ఊహల్లో పెళ్లాన్ని బుగ్గ గిల్లావా? ముద్దు పెట్టుకున్నావా? అని అడుగుతుంది. దీంతో రాజ్ కంగారు పడుతూ ఉంటాడు. కళావతి వస్తుంది వెళ్లు అని అంటాడు. నేను వెళ్లను అని ఇందిరా దేవి అంటే.. నోటి మీద వేలు వేసుకో అని చెప్తాడు రాజ్. కావ్య వచ్చి.. అందేంటి? అమ్మమ్మ గారూ నోటి మీద నుంచి వేలు తీయడం లేదని అడుగుతుంది. ఈలోపు రాజ్ కంగారు పడుతూ.. కావ్యని మ్యానేజ్ చేయడానికి ట్రై చేస్తాడు. నేను అబద్దాలు చెప్పను అనేసి ఇందిరా దేవి వెళ్తుంది. ఈ సీన్ అంతా నవ్వు తెప్పిస్తుంది. ఇక కళ్యాణ్ అనామిక అన్న మాటలు తలుచుకుంటూ బాధ పడతాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments