Brahmamudi, July 6th Episode: అడ్డంగా ఇరుక్కుపోయినా అనామిక.. అక్కాచెల్లెళ్ళు ఆడుకున్నారుగా!

0
39
Brahmamudi, July 6th Episode: అడ్డంగా ఇరుక్కుపోయినా అనామిక.. అక్కాచెల్లెళ్ళు ఆడుకున్నారుగా!

Brahmamudi, July 6th Episode: అడ్డంగా ఇరుక్కుపోయినా అనామిక.. అక్కాచెల్లెళ్ళు ఆడుకున్నారుగా!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూకి, కళ్యాణ్‌కి శిక్ష పడాలని, వీళ్ల ఇద్దరి మధ్య ఉన్న సంబంధం బయట పెట్టాలి. నా కాపురంలో ఇన్ని గొడవలకు కారణం అయిన అప్పూకి శిక్ష పడాలి. కళ్యాణ్ నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని అనామిక అంటుంది. కాళ్లు పట్టుకోవాలా.. పట్టుకోకపోతే అని జడ్జి అడుగుతాడు. కఠినంగా శిక్షించాలి. జైలుకు పంపించాలని అనామిక డిమాండ్ చేస్తుంది. సరే కళ్యాణ్ దుగ్గిరాల మీరేంటారు? అని జడ్జి అడిగితే.. నాకు విడాకులు కావాలని చెప్తాడు. శిక్షపడినా పర్వాలేదా అని జడ్జి అడిగితే.. అనామికతో కలిసి ఉండటం కంటే.. తప్పు చేయకపోయినా ఆ శిక్షను ఆనందంగా అనుభవిస్తాను అని కళ్యాణ్ చెప్తాడు. దీంతో రగిలిపోతున్న అనామిక.. నాకు విడాకులు ఇచ్చి.. ఆ అప్పూని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. నా భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోనని అనామిక అంటుంది. విడాకులు ఇచ్చాక నువ్వు ఒప్పుకునేది ఏంటి? అతను ఎవరినైనా చేసుకోవచ్చు. నీకు అనవసరం కాదు కదా.. జడ్జి అంటాడు.

కళ్యాణ్ మీద తప్పుడు కేసు పెట్టింది..

అప్పుడే కళ్యాణ్ లాయర్ లేచి.. అనామికను ప్రశ్నిస్తాడు. నీ పేరు ఏంటి.. మీ అమ్మానాన్నలు పెట్టిన పేరు ఏంటి? నీ సర్టిఫికేట్స్‌లో ఉండే పేరు ఏంటి? అని గుచ్చి గుచ్చి అడుగుతాడు. దీంతో సహనం కోల్పోయిన అనామిక పొగరుగా.. ఎన్ని సార్లు చెప్పాలి. ఎన్ని సార్లు చెప్పిందే చెప్పిస్తారు అని అంటుంది. నీకు చాలా చిరాకు వచ్చిందా.. అలాగే నీ భర్తకు కూడా వస్తుంది కదా.. నీ భర్తను అడిగిందే అడిగి.. చెప్పిందే చెప్పి.. ప్రతీ రోజూ ఎప్పుడూ అప్పూతో సంబంధం పెట్టుకున్నావ్ అంటే.. ఏ మగాడికైనా చిర్రెత్తుకొస్తుంది. యువరాణర్.. అతను కూడా మనిషే. అప్పూతో ఉన్నది నాకు కేవలం స్నేహం మాత్రమే అని చెప్పాడు. అయినా అనామిక వినలేదు. సంబంధం పెట్టుకున్నావ్ అంటూ చివరికి కోర్టుదాకా తెచ్చింది. అందుకే నా క్లయింట్ విసుగుపోయి.. విడాకులు అడిగాడు. ఎన్ని సార్లు చెప్పినా అప్పూతో కళ్యాణ్ స్నేహం మానుకోనని చెప్పాడు. దాంతో అనామక అహం దెబ్బతింది. అందుకే తన మీద తప్పుడు కేసు పెట్టింది. అందుకని నా క్లయింట్‌ని నిరపరాధిగా భావించాలని కోరుతున్నానని కళ్యాణ్ లాయర్ అంటాడు.

అనామిక డ్రామా మొత్తం బయట పడి పోయిందిగా..

అప్పుడే అనామిక లాయర్ వచ్చి.. అప్పూతో కళ్యాణ్‌కు కేవలం స్నేహం మాత్రమే లేదు. వాళ్లిద్దరూ రహస్యంగా కలుసు కోవడానికి కారణం ఏంటి? అప్పూ కళ్యాణ్‌ హోటల్ గదిలో దొరికి పోయారు కదా.. ఆ పుటేజ్ మీకు పంపించాను. అలాగే అప్పూని ప్రశ్నించాలని లాయర్ కోరుతుంది. దీంతో జడ్జి పర్మిషన్ ఇస్తాడు. అది తప్పుడు సమాచారమని కళ్యాణ్ లాయర్ అంటాడు. అనామికను ప్రశ్నిస్తాడు. అసలు అక్కడ ఏం జరిగింది? వాళ్లిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది? వాళ్లిద్దరూ ఒకే బెడ్ మీద ఉన్నారా? అసలు ఆ వీడియోలో ఏం సంబంధం ఏంటి? అని లాయర్ అడుగుతాడు. ఎలాంటి సంబంధం లేదు. కానీ వాళ్లు హోటల్‌లో దొరికారు కదా అని అనామిక అంటుంది. ఎలా దొరికారు? ఎందుకు దొరికారు? ఎన్ని క్షణాల్లో దొరికారు? అని అందుకు సంబంధించిన వీడియో లాయర్ జడ్జి గారెకి ఇస్తారు. అందులో అనామిక డ్రామా మొత్తం బయట పడుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. దీంతో అనామికను శిక్షించాలని కోరుతారు.

అనామికకు అప్పూ ఇచ్చిన షాక్..

ఆ తర్వాత అనామిక లాయర్.. అప్పూని ప్రశ్నిస్తుంది. కళ్యాణ్‌కు నీకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది? కేవలం నీకు అతను ఫ్రెండేనా? అని లాయర్ అడిగితే.. ఫ్రెండ్ అంటే ఫ్రెండే అని చెప్తుంది. మరి నువ్వు అతన్ని ప్రేమించావా? పెళ్లి చేసుకోవాలి అనుకున్నావా? అని లాయర్ అడిగితే.. అవును నేను ప్రేమించాను. కానీ అతను నన్ను ప్రేమించ లేదు. కేవలం ఫ్రెండ్ గానే చూశాడు. ఒక వేళ అతను కూడా నన్ను ప్రేమించి ఉంటే.. ఈ పాటికి పెళ్లి చేసుకునే వాళ్లం ఏమో అని సమాధానం ఇస్తుంది. ఇంక వేరే సంబంధం లేదా? అని లాయర్ అడిగితే.. లేదని అప్పూ అంటుంది. మరి రుజువు ఏంటి? అని లాయర్ అడిగితే.. ఉందని అప్పూ చెప్తుంది. అప్పుడే లాయర్ ఒక వీడియో జడ్జి గారెకి అందిస్తాడు. అందులో అప్పూతో అనామిక మాట్లాడిన మాటలు.. బంటి రికార్డ్ చేస్తాడు. ఆ వీడియో అందరూ చూసి షాక్ అవుతారు.

కావ్య ఊహించని షాక్.. పాపం జైలుకు అనామిక..

మరి అనామిక అనుభవించిన చిత్ర హింసల గురించి ఏంటి? అని అనామిక లాయర్ అడిగితే.. బాణాలు వదిలి.. విల్లును మర్చిపోతావా మేడమ్.. ఈ కేసులో బలమైన సాక్ష్యం సేకరించిన.. ప్రత్యక్ష సాక్షిని ప్రవేశ పెట్టాలని కోర్టు వారిని కోరుతున్నాం. ఆ సాక్షి పేరు కావ్య అని చెప్తాడు లాయర్. అది విని అందరూ షాక్ అవుతారు. బోనులోకి వచ్చిన కావ్య.. తన మరిది చాలా మంచివాడని చెప్తుంది. అనామిక గురించి అసలు నిజ స్వరూపం రాత్రే తెలిసిందని.. కావ్య అంటుంది. నేను రాత్రి అనామికతో మాట్లాడాలని వెళ్తే.. అనామిక నిజ స్వరూపం బయట పడింది. కలవడానికి వెళ్లినా.. దాడి చేసిందని ఆరోపణ మోపుతుందని.. అనామికకు తెలీకుండా నేను రికార్డ్ చేయించానని కావ్య అంటుంది. ఆ వీడియోను జడ్జి గారికి అందిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here