Tuesday, November 5, 2024
Google search engine
HomeUncategorizedBrahmamudi, July 5th Episode: అనామిక సంగతి ఇక మటాష్.. ట్విస్ట్ ఇచ్చిన కావ్య!

Brahmamudi, July 5th Episode: అనామిక సంగతి ఇక మటాష్.. ట్విస్ట్ ఇచ్చిన కావ్య!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ గదిలో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చిన కావ్య.. ఏం ఆలోచిస్తున్నారు? ఇంట్లో అందరూ కవి గారికే శిక్ష పడుతుందని అనుకుంటున్నారని అంటుంది. అవును పరిస్థితి చూస్తే అలానే ఉందని రాజ్ అంటాడు. ఏవండీ మనం ఒకసారి వెళ్లి అనామికతో మాట్లాడి వద్దామని కావ్య అంటే.. రాజ్ సీరియస్ అవుతాడు. ముందు మీ తమ్ముడికి శిక్ష పడకుండా బయటకు తీసుకురావడమే ముఖ్యం. ఇంత బలగం, బలం ఉండి కూడా ఒక అమాయకుడికి శిక్ష పడటం ఎంత వరకూ కరెక్ట్ అని కావ్య చెప్తుంది. న్యాయ స్థానం ముందు బలం, బలగం పనికి రావు.. ఇది ఎంత దూరం వెళ్లిందో నీకు అర్థం కావడం లేదని రాజ్ అంటాడు. ఇంకా ఒక అవకాశం మిగిలే ఉంది. మనం అనామిక ఇంటికి వెళ్లి మాట్లాడదామని కావ్య అంటే.. అది చాలు మనం వెళ్లి వాళ్ల ఇంటి మీద దాడి చేశామని మరో కేసు పెడతారు.

నువ్వు ఇక పుట్టింటి నుంచి అత్తింటికి రావు..

మనుషులా వాళ్లు.. కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇది డబ్బు సమస్య కాదు. కళ్యాణ్ కోసం ఎవరైనా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వెళ్లి కేసు వాపస్ తీసుకోమని మాత్రం నేను వెళ్లను.. నువ్వు వెళ్తే వెళ్లు అని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్య.. అనామిక ఇంటికి వస్తుంది. కావ్యని చూసి అనామిక వెటకారంగా నవ్వుతుంది. కాలి మీద కాలు వేసుకుని ఊపుతూ ఉంటుంది. అనుకున్నాను.. నా పుట్టింటిని వెతుక్కుంటూ.. నా అత్తింటి నుంచి రాయబారానికి వస్తారని అనుకున్నానని అనామిక అంటుంది. రాయబారానికి వచ్చిన వాళ్లను గౌరవంగా చూస్తారు. కానీ నువ్వు ఇప్పుడు కూర్చోమనకుండా.. కాలి మీద కాలు వేసుకుని కూర్చొంటే అర్థమైందని కావ్య అంటుంది. ఏం అర్థమైందని అనామిక అంటే.. నువ్వు ఇక పుట్టింటి నుంచి అత్తింటికి రావని కావ్య అంటుంది. ఇంకా నేను అక్కడికి ఎందుకు వస్తాను. కళ్యాణే ఇక్కడికి వస్తాడని అంటుంది.

నాకు కోట్లు కావాలి..

నువ్వు ఎన్ని గొడవలు పడ్డా ఒపికగానే ఉన్నాడు కదా అని కావ్య అంటే.. ఆ ఓపిక నాకు ఎందుకు? బిజినెస్ చూసుకోవాలి.. కోట్లు సంపాదించాలి.. అదంతా తెచ్చి నా ముందు కుమ్మరించాలి. అలాంటివి చేతకాని మనిషికి ఇలానే బుద్ధి చెప్పాలని అనామిక అంటే.. అంటే నువ్వు కళ్యాణ్‌ని ప్రేమ కోసం కాదా.. ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావా? అని కావ్య అడిగితే.. అంతేగా అందుకే చేసుకున్నా. నాకు లగ్జరీ యస్‌గా ఉండటం ఇష్టమని అంటుంది అనామిక. నీకు ఎంత కావాలో అంత వాళ్లు ఇచ్చేస్తారు కదా.. కళ్యాణ్ సంతకం చేసిన చెక్కు మీద పది లక్షలు నువ్వు మీ నాన్న పేరు రాసి ఇచ్చినప్పుడే ఎవరికీ తెలీదు అనుకున్నావా? అయినా నీ విలువ కాపాడారు. అంత తక్కువ డబ్బుతో నాకెందుకు.. నాకు కోట్లు కావాలని అనామిక అంటే.. అర్థమైంది.. నీ పుట్టింటి వాళ్లక ఎన్ని కోట్లు అప్పు ఉందో అర్థమైంది. వాళ్లకు దోచి పెట్టడానికే కదా.. కళ్యాణ్‌ని ఇబ్బంది పెడుతున్నావ్? అందుకే ఇక్కడి దాకా లాక్కొచ్చావని కావ్య అంటుంది.

ఇవి కూడా చదవండి

కళ్యాణ్.. నా కాళ్ల దగ్గరకు రాక తప్పదు..

అవును నా పుట్టింటి అప్పులు తీర్చడానికే నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు ఇంత గొడవ జరిగితే అయినా కూడా అందరూ దిగి వస్తారు. దుగ్గిరాల వంశంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. వాళ్లు ఎప్పుడూ పరువు, ప్రతిష్ఠ అంటారు. కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ నా కాళ్ల బేరానికి వస్తాడని అనామిక అంటుంది. నువ్వు చాలా కలలు కంటున్నావ్ అనామిక అని కావ్య అంటే.. లేదు నేను చాలా తెలివిగా, పకడ్బందీగా కేసులో ఇరికించాను. చట్టాలు అన్నీ ఆడవాళ్లకే అనుకూలంగా ఉంటాయి. కళ్యాణ్ జైలుకు వెళ్లక తప్పదు.. నా కాళ్ల దగ్గరకు రాక తప్పదని అంటుంది అనామిక. నువ్వు కళ్యాణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్ అనుకున్నా.. ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావు అని తెలిసింది. కరెక్ట్ నీకు అర్థమైంది కదా.. వెళ్లి వాళ్లందరికీ చెప్పు.. జైలుకు వెళ్లకుండా నాకు నచ్చి ఉండమను. వెళ్లు రేపు కోర్టులో కలుద్దామని అనామిక వెళ్లి పోతుంది.

అప్పూని టార్గెట్ చేసిన మీడియా..

కట్ చేస్తే.. తెల్లవారుతుంది. అందరూ కోర్టుకు వెళ్తారు. అక్కడ మహిళా సంఘాలు కళ్యాణ్ డాం డాం.. కళ్యాణ్‌కు శిక్ష పడాలని అంటారు. మీడియా మొత్తం కవరేజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కనకం వాళ్లు వస్తారు. అప్పూని చూసిన మీడియా వాళ్లు అక్కడకి వెళ్తారు. కళ్యాణ్‌కి, మీకు ఎన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం నడుస్తుంది? అనామికకు మీకు గొడవలు ఉన్నాయా? అని రక రకాలుగా ప్రశ్నలు అడుగుతారు. దీంతో కనకం కోపంగా స్పందిస్తుంది. చాలు ఆపండి.. ఆడ పిల్లలు అయి ఉండి మరో ఆడపిల్లను అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది. నా కూతురు కూడా ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే ఇక్కడికి వచ్చామని వెళ్తారు కనకం వాళ్లు. ఇక అందరూ లోపలికి వెళ్తారు.

నీకు నువ్వే సర్వ నాశనం చేసుకుంటున్నావు..

కళ్యాణ్ దగ్గరు వచ్చి అనామిక కావాలనే రెచ్చ గొడుతుంది. ఎలా ఉండే నిన్ను ఎక్కడి దాకా తెచ్చానో చూశావు కదా అని అంటుంది. నీ బతుకు ఎవరో కాదు అనామిక నీకు నువ్వే సర్వ నాశనం చేసుకుంటున్నావు. నాదేముంది.. నువ్వు గడప దాటిన నుంచి ప్రశాంతంగా పడుకుంటున్నా అని అంటాడు. ఇవాళ నిన్నూ నీ ప్రియురాలిని అందరూ చీదరించుకునేలా చేయకపోతే నా పేరు అనామికనే కాదని అంటుంది. అక్కడే ఉన్న కానిస్టేబుల్.. వెళ్లమని చెప్తాడు. అప్పుడే జడ్జి వస్తాడు.

ఇద్దరూ కలిసి పోతారా..

తగాదాలు లేని భార్యాభర్తలు ఉండరు. అభిప్రాయభేదాలు ఉండని వాళ్లు కూడా ఉండరు. ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారు. అనే విషయం పక్కన పెడితే.. కోర్టు దాక రాక ముందే పరిష్కారం చేసుకోవాలి. నేను అందరి గురించి మాట్లాడటం లేదు. ఈ కేసు గురించి మాత్రమే చెప్తున్నా. అబ్బాయి ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాడు. కాబట్టి విడాకుల దాకా వెళ్లకుండా ఉండాలని ఆశిస్తున్నా. ఇప్పటిదాకా మించిపోయింది లేదు.. అప్పూ అనే మూడో వ్యక్తి వలన గొడవలు వస్తున్నాయి అంటున్నారు. ఆ అమ్మాయిని కోర్టులో నిలబెట్టి పరువు తీయాలని కాదు. కాబట్టి నేను మీ ఇద్దర్నీ అడుగుతున్నా. ఇద్దరూ కలిసి ఉండటానికి ఒప్పుకుంటారా? అని ముందు అనామికను అడుగుతాడు జడ్జి.

నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి.. జడ్జి షాక్..

కావాలి సర్.. కానీ ఇంత సింపుల్‌గా అయితే కాదు. ఆ అప్పూని బోనులో నిలబెట్టాలి. వీళ్ల ఇద్దరి మధ్య ఉన్న సంబంధం బయట పెట్టాలి. నా కాపురంలో ఇన్ని గొడవలకు కారణం అయిన అప్పూకి శిక్ష పడాలి. కళ్యాణ్ నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని అనామిక అంటుంది. కాళ్లు పట్టుకోవాలా.. పట్టుకోకపోతే అని జడ్జి అడుగుతాడు. కఠినంగా శిక్షించాలి. జైలుకు పంపించాలని అనామిక డిమాండ్ చేస్తుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments