Friday, December 27, 2024
Google search engine
HomeUncategorizedBrahmamudi, July 4th Episode: కళ్యాణ్, రాజ్‌లపై కోడి గుడ్లు, టమాటాలు.. అనామిక ఛాలెంజ్!

Brahmamudi, July 4th Episode: కళ్యాణ్, రాజ్‌లపై కోడి గుడ్లు, టమాటాలు.. అనామిక ఛాలెంజ్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కోర్టులో నుంచి బయటకు వస్తారు. నా వంతు ప్రయత్నం నేను చేశాను సర్. కానీ కళ్యాణ్ గారు అనామికను టార్చర్ పెట్టలేదని, తనే ఇదంతా కావాలని చేసినట్టు సాక్ష్యం ఏదైనా ఉందా? లాయర్ అడుగుతాడు. భార్యని భర్త ఎలా చూసుకుంటాడు అన్న దానికి సాక్ష్యం ఎలా ఉంటుంది లాయర్ గారూ.. అది నమ్మకం మీద ఉంటుంది. ఏ రోజు ఎలా ఉందని సాక్ష్యం పెట్టుకుంటారా? అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. కళ్యాణ్ తనపై చేయి చేసుకున్నట్టు సాక్ష్యం ఉంది. కోర్టులో అందరి ముందూ మీ అబ్బాయి ఒప్పుకున్నాడు. మరి దీనికి కూడా సాక్ష్యం కావాలి. కోర్టుకు సాక్ష్యాలే కావాలి అని లాయర్ అంటే.. అలాంటి సాక్ష్యాలు వాళ్ల దగ్గర ఏమీ ఉండవు లాయర్ గారు. ఎందుకంటే నా మొగుడు నాతో అలా ప్రేమగా ఎప్పుడూ నడచుకోలేదు కదా.. అని అనామిక అంటే.. కళ్యాణ్ కోపంగా ఉంటుంది.

అనామిక ఛాలెంజ్..

నోరు మూయవే రాక్షసి.. నిన్ను నా కూతురులా చూసుకున్నా. ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చాను. దానికి ఈ రోజు బాగా సమాధానం చెప్పావ్ అని ధాన్య లక్ష్మి అంటుంది. చూడండి అత్తయ్యా ఇప్పటికీ నా బాల్ నా చేతిలోనే ఉంది. మీ అబ్బాయి చేసిన తప్పులన్నింటికీ నాకు క్షమాపణ చెప్పి తిరిగి ఆ ఇంటికి తీసుకెళ్తాడేమో అడగండి. నేను ఇక్కడే కేసు వాపస్ తీసుకుంటానని అనామిక అంటుంది. కుదరదని కళ్యాణ్ అనేసరికి.. సరే అయితే చూద్దాం సాక్ష్యాలు తీసుకురండి చూద్దాం అని వెళ్లిపోతుంది. ఏం జరిగినా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండమని రాజ్ అంటాడు. ఈలోపు రుద్రాణి.. రేయ్ నేను చెప్పింది చేశావా అని అడిగితే.. అంతా ప్లాన్ చేశాను మామ్. ఇప్పుడు సీన్ చూడు. కళ్యాణ్‌కు సన్మానం చేస్తారని రాహుల్ అంటాడు.

రాజ్, కళ్యాణ్‌లపై టమాటాలు, గుడ్లు..

ఆ తర్వాత కళ్యాణ్‌ను పోలీసులు తీసుకెళ్తుండగా.. రాహుల్ మనుషులు కావాలనే అతనిపై టమాటాలు, గుడ్లు విసురుతారు. అది చూసిన రాజ్ వాళ్లు.. వెంటనే వెళ్లి అడ్డు పడతారు. రాజ్ పై కూడా టమాటాలు, గుడ్లు విసురుతారు ఆ తర్వాత వాళ్లను పోలీసులు అడ్డుకుంటారు. ఇక రాజ్ తన పదునైన మాటలతో వాళ్లకు సిగ్గు వచ్చేలా మాట్లాడతాడు. నిజం తెలిసిన రోజు మీరే సిగ్గుతో తల దించుకుంటారని అంటాడు. అది చూసి అనామిక నవ్వుతుంది.

ఇవి కూడా చదవండి

గుండెల్ని పిండేసే సీన్..

ఈ సీన్ తర్వాత కృష్ణ మూర్తి వచ్చి అప్పూని కోర్టుకు రావాలని చెప్పతాడు. ఏంటి అప్పూ కోర్టుకు రావాలా? వాళ్లు గొడవ పడితే నా కూతురికి ఏంటి సంబంధం? అది కోర్టుకు వెళ్లడానికి నేను ఒప్పుకోను అని కనకం అంటుంది. అలా అడ్డుపడితే పోలీసులు వస్తారే అని కృష్ణ మూర్తి అంటే.. రానివ్వండి వాళ్లను పట్టుకుని దులిపేస్తానని కనకం అంటుంది. అలా అయితే వాళ్లు నిన్ను కూడా తీసుకెళ్తారని అంటాడు. ఇక అప్పుడు కనకానికి అర్థమయ్యేలా చేప్తుంది. ఆ గొడవ జరిగింది నా గురించే కదా అని అనామిక చెప్పింది. కాబట్టి నేను కూడా వెళ్లాలి. ఇప్పుడు నేను కోర్టుకు వెళ్లకపోతే.. అందరూ అనుకున్నదే నిజం అవుతుంది. కాబట్టి నేను వెళ్లడమే మంచిదని అప్పూ అంటే.. కనకం ఒప్పుకోదు. అప్పూ నచ్చజెప్తుంది. నేను ఒక్కదానినే కోర్టుకు వెళ్తాను అంటుంది. వద్ద నేను కూడా వస్తాను. అక్కడ కళ్యాణ్‌ని ఎంతలా అవమానించారో చూశావు కదా.. నిన్ను కూడా అలానే అంటారు అంటుంది. వద్దని అప్పూ చెప్తుంది. లేదు నేను కూడా వస్తాను. ఆ జడ్జి కాళ్లు పట్టుకుని అయినా నీకు పడే శిక్ష నేను వేసుకుంటాను అని కనకం అంటే.. అప్పూ బాధ పడుతుంది.

సీతా రామయ్య బాధ..

ఈ సీన్ కట్ చేస్తే.. అనామిక చేసిన పనికి ఇంట్లో వాళ్లందరూ బాధ పడతారు. ఈ రోజు మన వంశ చరిత్రలో ఏనాడూ జరగనంత పరాభవం జరిగింది. కుటుంబ పరువు మొత్తం పోయింది. కుటుంబాన్ని మొత్తాన్ని కోర్టు గుమ్మం ఎక్కించింది. ఏం సాధించాలని? ఏం పొందాలని? ఎందుకు ఇంత దూరం వెళ్లింది? అనామికకు ఎలాంటి అపకారం చేయలేదు కదా.. అని సీతా రామయ్య అంటాడు. మన కుటుంబంలో కూడా ఆవేశం తన్నుక్కొచ్చిందంటే అందుకు అనామిక ప్రవర్తనే కారణమని పెద్దావిడ అంటుంది. టీవీలో మాట్లాడి.. పోలీస్ కేసు పెట్టి.. కోర్టు దాకా తెచ్చింది. కేవలం కళ్యాణ్ ప్రేమించాడని.. పెళ్లి చేశాం. అందుకు అనుభవిస్తున్నామని ఇందిరా దేవి అంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు అత్తయ్యా.. మన కళ్యాణ్ గురించి ఆలోచించాలని అంటుంది. అంటే ఏంటి.. ఇప్పుడు మనం అందరం అనామికను క్షమాపణ అడిగి.. ఇంటి కోడలిగా తీసుకురావాలా అని సుభాష్ అంటే.. ఇంకేం చేయాలి? మన కళ్యాణ్ గురించి తప్పదు కదా అని ధాన్య లక్ష్మి అంటుంది.

పూచిక పుల్లతో తీసి పారేసింది..

మీరందరూ ఇంటి పరిస్థితి పరువు గురించి ఆలోచిస్తున్నారే తప్పా.. నా కొడుకు పరిస్థితి గురించి ఒక్కరు కూడా పట్టించు కోవడం లేదని అంటుంది ధాన్యలక్ష్మి. నోర్ముయ ఏం మాట్లాడుతున్నావ్? పెళ్లి అయిన తర్వాత కళ్యాణ్‌ని ఒక్కసారైనా నమ్మావా? అప్పూ విషయంలో ఎంత అవమానించినా.. అనుమానించినా.. నా కొడుకు అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాడు. ఈ ఇంట్లో ప్రతీ ఒక్కరినీ పూచిక పుల్లతో తీసి పారేసిందని ప్రకాశం సీరియస్ అవుతాడు. ఆగు బాబాయ్ నవ్వు ఆవేశ పడకు.. పిన్నీ నువ్వు కంగారు పడి, భయ పడి.. అనామికను ఇంటికి తీసుకొస్తే.. ఈ ఇల్లు నాలుగు రోజుల్లో ముక్కలై పోతుంది. కళ్యాణ్‌ను మన నుంచి దూరంగా తీసుకెళ్లి పోతుందని రాజ్ అంటాడు.

కోర్టులో నోరు తెరవండి..

చిన్న అత్తయ్యా అనామిక ఏం ఆశించి ఇంత చేస్తుందో.. మీరు ఇంకా అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా? కవి గారెకి ఏ శిక్షా పడకుండా క్షేమంగా తీసుకురావాలని అందరం కోరుకుంటున్నాం. మీరు అపార్థాలతో అనామిక లాగే వేరు చేసి మాట్లాడకండి అని కావ్య అంటే.. నువ్వు మధ్యలో మాట్లాడకు కావ్యా.. మొత్తం నీ చెల్లి, నీ కుటుంబమే ఈ పరిస్థితికి కారణమని ధాన్య లక్ష్మి అంటుంది. సరే మేము అందరం వెళ్లి.. అనామిక ముందు తల దించుకుని తప్పు ఒప్పుకుంటాం. కవి గారెని వదిలేస్తుందా? మీరు వెళ్లి మీ ముద్దుల కోడలికి చెప్పండి.. వింటుందోమో చూద్దాం. అనామిక లాగ మీరు మా కుటుంబం ఆరోపణలు చేయకండని కావ్య అంటే.. ధాన్య లక్ష్మి ఎవరితో మాట్లాడుతున్నావ్?అర్థమవుతుందా అని అడుగుతుంది. అప్పుడే స్పప్న అందుకుంటుంది. మా కుటుంబంపై పడుతున్నారు? మీకు దమ్ము లేదా? ధైర్యం లేదా? కోడల్ని అదుపులో పెట్టుకోవడం చేత కాదా? ఊరి మీద వదిలేసి మా కుటుంబాన్ని అంటారేంటి? మీకు చేతనైతే కోర్టులో నోరు తెరవండి నోరు అని స్వప్న అంటుంది. ఇక ధాన్య లక్ష్మికి సర్ది చెప్తాడు రాజ్. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments