Wednesday, November 20, 2024
Google search engine
HomeUncategorizedBrahmamudi, July 23rd Episode: అంతా రాజ్ ప్లానే అన్నమాట.. రాజ్‌కు అపర్ణ చివాట్లు..

Brahmamudi, July 23rd Episode: అంతా రాజ్ ప్లానే అన్నమాట.. రాజ్‌కు అపర్ణ చివాట్లు..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఇక నుంచి కావ్యకి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అని అపర్ణ అంటుంది. పోనీలే ఇప్పటికైనా కావ్యని అర్థం చేసుకున్నావు అని ఇందిరా దేవి అంటుంది. ఇక తెల్లవారుతుంది. కావ్య నుదిటిపై ముద్దు పెట్టుకుని రాజ్ లేస్తాడు. బయటకు వచ్చి అటూ ఇటూ తిరుగుతాడు. ఇంతలో కళావతి లేస్తుంది. ఇవన్నీ ఎలా వచ్చాయి అనుకుంటుంది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి.. ఏంటి సార్ అరేంజ్ మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి అని అడుగుతాడు. నేను ఏం చెప్పాను నువ్వేం చేశావని అడుగుతాడు రాజ్. అంతా మీరు చెప్పినట్టే చేశాను కదా సర్ అని ఆ వ్యక్తి అంటాడు. నేను దెయ్యంలా మెరుపుతీగలా దూరం నుంచి వెళ్లమంటే.. నా పక్క నుంచి వెళ్లావేంటి అని రాజ్ అంటే.. మేడమ్ గారు భయపడ్డారు కదా సర్ వ్యక్తి అంటాడు. నువ్వు వచ్చినందుకు భయ పడలేదు. నేను అరిచిన అరుపులకు భయపడింది. అయినా వర్షం నాలుగు చుక్కలు వదిలి.. ఎక్కడికి వెళ్లిపోయారు అని రాజ్ అంటే.. పైపు జామ్ అయ్యింది. ఆ తర్వాత భారీ వర్షమే వచ్చింది కదా సర్. రాత్రంతా కష్టపడ్డాం కదా సర్.. ఇక చూసి ఇవ్వండి. మీరు మళ్లీ శోభనం చేసుకొనేటప్పుడు ఇక్కడికే రండి సర్. అప్పుడు ఇంకా ఎక్కువ పైపులు పెడతాను అని అంటాడు ఆ వ్యక్తి. శోభనం ఎవరైనా ఒక్కటే సారి చేసుకుంటారు. వెళ్లు వెళ్లు అని వెనక్కి తిరుగుతాడు రాజ్. వెనకాల అప్పటికే కావ్య నిల్చుని ఉంటుంది.

కళావతా మజాకా.. ఓవరాక్షన్‌కి తగ్గేదెలా..

ఇక కావ్య తన స్టైల్‌లో ఓవరాక్షన్ మొదలు పెడుతుంది. అబ్బబ్బా ఏం ప్లాన్ చేశారండి మీరు. ఈ బూత్ బంగ్లాకి మీరు కావాలనే తీసుకొచ్చారన్నమాట. ఈ బూత్ బంగ్లాలో దెయ్యంలా తిరిగింది, వర్షం కురిపించిన వరుణ దేవుడు వాడేనా అని కావ్య అంటుంది. రాజ్ ఏమీ మాట్లాడకుండా నీళ్లు నములుతాడు. అబ్బా అది కాదు.. నువ్వు ఊరుకో అబ్బా.. నాకు ఇగో ఏంటి? నేను చాలా మంచివాడిని.. వెళ్దామా అని రాజ్ అంటే.. మాట మార్చకండి. ఎంత అహంకారం మీకు? నన్ను ప్రేమతో దగ్గర తీసుకోలేక.. మీ సర్ ప్రైజ్‌లకు థ్రిల్ అయిపోయి.. కారు ఆగిపోయి.. వాన వచ్చి.. దెయ్యం వచ్చి.. నేను భయపడి పోయి మిమ్మల్ని హగ్ చేసుకుని.. చివరికి అంతా జరిగేలా ప్లాన్ చేశారా. మీరు పెళ్లాంతో కాపురం వెలగ పెట్టడానికి ఇంత కంతే సుందరమైన ప్లేస్ దొరక లేదా? రేపు పిల్లలు పుట్టి మీ శోభనం ఎక్కడ జరిగింది అమ్మా? అని పిల్లలు అడిగితే.. ఇలాంటి ప్రదేశంలో జరిగిందని చెప్పాలా? అని కావ్య వాయిం చేస్తుంది. రాజ్ ఏం మాట్లాడకుండా నిల్చుంటాడు.

కావ్య కాళ్లు పట్టుకున్న రాజ్..

ఇదంతా వెళ్లి నేను అత్తయ్య గారికి, అమ్మమ్మ గారికి చెప్పేస్తాను అని కావ్య అంటే.. ఏయ్ ఇలాంటివన్నీ చెప్పుకుంటారా ఏంటి? అని రాజ్ అంటాడు. లేదు.. మీకుంది ఇదంతా నేను వెళ్లి చెప్పేస్తాను అని కావ్య వెళ్తుంటే.. ఏయ్ అంత పని చేయకే. ఇవన్నీ ఇంట్లో చెప్పకే.. ఛీ అంటారే.. కావాలంటే కాళ్లు పట్టుకుంటాను అని రాజ్ అంటాడు. ఏంటి కాళ్లు పట్టుకుంటా అన్నారు కదా.. సరే కాళ్లు పట్టుకోండని కావ్య అంటే.. రాజ్ ఇగోకి పోతాడు. అయినా ఇంకా కావ్య తగ్గకుండా కాళ్లు పట్టుకోమని అంటుంది. రాజ్ కాళ్లు పట్టుకునే సమయంలో.. వద్దులేండి అని అంటుంది కళావతి. ఇక ఇద్దరూ బట్టలు మార్చుకుని ఇంటికి బయలు దేరతారు.

ఇవి కూడా చదవండి

కంగారులో అపర్ణ, ఇందిరా దేవిలు..

రాజ్, కావ్యలు ఇకా ఇంటికి రాలేదని ఇందిరా దేవిలు, అపర్ణలు ఎదురు చూస్తూ ఉంటారు. ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యింది. అసలు వాళ్లు ఎక్కడ ఏం చేస్తున్నారు? అని అలా రక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కావ్య, రాజ్‌లు ఇంటికి వస్తారు.వాళ్లను చూసిన అపర్ణ, ఇందిరా దేవిలు.. ఎక్కడికి వెళ్లారు రాత్రంతా? రాత్రంతా ఎక్కడ ఉన్నారు? అసలు ఏమైంది? అని ప్రశ్నలు వేస్తారు. మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి.. అని రాజ్ అంటే.. సరే రాత్రంతా ఎక్కడికి వెళ్లారు? అని ఇందిరా దేవి అడిగితే.. అడ్వంచర్స్ అమ్మమ్మా అని కావ్య అంటుంది. దానికి అపర్ణ షాక్ అవుతుంది. మీ మనవడు గారు.. డిన్నర్ అని చెప్పి నా చేత అడ్వంచర్స్ చేయించారని కావ్య ఇక చెబుతూ ఉండగా.. రాజ్ అడ్డు పడతాడు. అదే నానమ్మా డిన్నర్ చేసి వస్తూ ఉంటే కారు ఆగిపోయిందని అంటాడు.

రాజ్‌ని అడ్డంగా ఇరికించేసిన కావ్య..

ఆగిపోయిందా.. ఆగిపోయేలా చేశారా? అని కావ్య అంటే.. రాజ్ అడ్డు పడతాడు. ఇక మల్లీ ఓవరాక్షన్ స్టార్ట్ చేస్తుంది కావ్య. మీరే కదా కారు ఆగిపోయిందని పాడు బట్ట బంగ్లాకి తీసుకెళ్లారని అంటుంటే.. పాడుపడ్డ బంగ్లా ఏంటి? ఈ వయసులో నాకు టెన్షన్ పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా.. అసలు అక్కడికి ఎందుకు వెళ్లారని పెద్దావిడ గట్టిగా అడుగుతుంది. అంటే నాన్నమ్మా అని రాజ్ చెప్పబోతే.. నువ్వు ఆగు.. నా మనవరాలు చెప్తుందని అంటుంది. మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యాన్ని.. ఊరు బయట ఉన్న పాడుపడ్డ బంగ్లాలో కానించేశారని అంటుంది. దీంతో పెద్దావిడ, అపర్ణ షాక్ అవుతూ నోర్లు మూసుకుంటారు. ఇక రాజ్ తికమక పడుతూ ఉంటాడు. కారు పాడయినట్టు నటించి.. వర్షం రాక పోయినా.. వచ్చినట్టు నాకు చూపించి.. పాడుపడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లి.. నన్ను బెదిరించి, భయపెట్టి అని ఏడుస్తూ రాజ్‌ని ఇరికిం చేసి వెళ్లిపోతుంది. దీంతో అపర్ణ, ఇందిరా దేవిలు ఇద్దరూ రాజ్‌ని తిడతారు. నాకు అవకాశం దొరికినప్పుడు నిన్ను ఖచ్చితంగా ఇరికించేస్తాను అని రాజ్ అంటాడు.

నాకు ఇష్టం లేకుండా ఆయన నా మీద చేయి వేయగలరా..

ఇక కావ్య గదిలో నిలబడి ఉంటుంది. అప్పుడే కావ్య దగ్గరకు పెద్దావిడ వస్తుంది. కావ్యా బాధ పడుతున్నావా? వాడు ప్రేమతో దగ్గర అవ్వాలి అనుకున్నాడు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నిన్ను బాధ పెడతాడు అనుకోలేదు. వాడు మంచివాడే. కాకపోతే ఆ మంచి తనం వెనుక కోపం దాగి ఉంటుంది. మనం వాడి కోపాన్ని దాటి చూసినప్పుడు ఆ నిజమైన ప్రేమ పరిచయం అవుతుంది. వాడికి నీ మీద అమితమైన ప్రేమ ఉంది. వాడి ప్రేమని తప్పుగా అర్థం చేసుకోకమ్మా అని ఇందిరా దేవి అంటుంది. నా పెళ్లి రోజున అందరూ కలిసి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆయన కోసం నేను ఎంతో ప్రేమగా ఎదురు చూస్తుంటే.. ఆయన ఒక బిడ్డను తీసుకొచ్చాడు. అప్పుడు అందరూ ఆయన్ని తప్పుపట్టినా.. నేను ఆయన ఆ తప్పు చేసి ఉంటాడని అనుకోలేదు. ఆయన మీద ఆయన కంటే నాకే ఎక్కువగా నమ్మకం ఉంది. అలాంటి మనిషిని నేను ఎలా అపార్థం చేసుకుంటాను. నాకు ఇష్టం లేకుండా ఆయన నా మీద చేయి వేయగలరా? ఆయన చేస్తున్న ప్రతీ పని నాకు తెలుసు. అన్నీ తెలిసి కూడా మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే అది నాకు నచ్చిందని కావ్య సిగ్గు పడుతూ చెబుతుంటే.. ఇందిరా దేవి నవ్వుతుంది. రాత్రంతా జరిగింది అంతా నాకు ఒక మధురమైన జ్ఞాపకంలా గుర్తుకు ఉంటుందని కావ్య అంటే.. ఇలాగే సంతోషంగా కాపురం చేసుకుంటూ నాకు ఒక మనవడిని ఇవ్వమని పెద్దావిడ అంటే.. ఆ విషయం మీ మనవడికి చెప్పమని కావ్య సిగ్గు పడుతూ వెళ్తుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments