Monday, November 18, 2024
Google search engine
HomeUncategorizedBrahmamudi, July 22nd Episode: ప్రేమలో మునిగి తేలిన రాజ్, కావ్యలు.. రాజ్ ప్లాన్ అదిరిపోయింది!

Brahmamudi, July 22nd Episode: ప్రేమలో మునిగి తేలిన రాజ్, కావ్యలు.. రాజ్ ప్లాన్ అదిరిపోయింది!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యని డిన్నర్‌ కోసమని బయటకు తీసుకెళ్తాడు రాజ్. అక్కడ కావ్యని సర్ ప్రైజ్ చేయడానికి ఓ ప్లాన్ చేస్తాడు. రెస్టారెంట్ మేనేజర్ దగ్గరకు వెళ్లి అన్ని అరేంజ్ మెంట్స్ చేసేశావు కదా.. అని అడుగుతాడు. మీకెందుకు సర్ అన్నీ నేను చూసుకుంటా మీరు వెళ్లమని అంటాడు. కట్ చేస్తే.. మేనేజర్ అనౌన్స్‌మెంట్ చేస్తాడు. కట్ చేస్తే.. అన్నా చెల్లెలి అనుబంధం అంటూ సాంగ్ ప్లే అవుతుంది. కేక్ మీద సిస్టర్ అని ఉంటుంది. దీంతో రాజ్, కావ్యలు షాక్ అవుతాడు. పాపం రాజ్ ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుంది. మళ్లీ మరోసారి ఇంకో సాంగ్ ప్లే చేస్తాడు. అప్పుడే అమ్మానాన్నల పెళ్లి సాంగ్ ప్లే అవుతుంది. కావ్య ఇక పగలపడి నవ్వుతుంది. లేకలేక మీరు నన్ను రెస్టారెంట్‌కి తీసుకొస్తే.. ఇలా జరిగిందని అంటుంది కావ్య. ఇక ఫుడ్ తినేసి రాజ్ వాళ్లు ఇంటికి బయలుదేరుతారు.

రాజ్ ప్లాన్ ఫ్లాప్.. కావ్య నవ్వులు..

కారులో రాజ్ చిరాకు పడుతూ ఉంటుంది. అప్పుడు కావ్య సాంగ్ ప్లే చేస్తుంది. కానీ అందులో కూడా అసలు ఏ మాత్రం సెట్ కాని సాంగ్స్ ప్లే అవుతాయి. దీంతో కావ్య నవ్వుతుంది. చివరికి కారు ఓ చోట ఆగిపోతుంది. రాకరాక మనం బయటకు వస్తే కాలానికి కూడా కామెడీ వస్తుంది. అందుకే కారు ఆగిపోయింది. తీరా కట్ చేస్తే.. పక్కనే ఉన్న ఇంటికి వెళ్తారు. కావ్య భయపడుతూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్తారు. అక్కడ అంతా క్యాండిల్స్‌తో అంతా అలంకరిస్తారు. చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అది చూసి కావ్య షాక్ అవుతుంది. రాజ్ కూడా తికమక పడుతూ ఉంటాడు. ఏంటి ఇదంతా అని కావ్య అడుగుతుంది. కావ్యకి ఇక ఏవోవో డౌట్స్ వస్తూ ఉంటాయి. అక్కడ శారీ పెట్టి ఉంటుంది. వెళ్లి మార్చుకుని రమ్మని రాజ్ చెప్తాడు. కావ్య మొహమాట పడుతూ ఉంటుంది.

ఒక్కటైపోయిన రాజ్, కావ్యలు..

కావ్య వర్షం తగ్గిపోయింది వెళ్లి పోదామని అంటే.. ఓయ్ వర్షం అని పిలుస్తాడు. వెంటనే వర్షం పడుతుంది.అదంతా చూస్తుంటే రాజే ప్లాన్ చేసినట్టు ఉంది. ఆ తర్వాత కావ్య, రాజ్‌లు ఇద్దరూ డ్రెస్ మార్చుకుంటారు. అప్పుడే ‘మధురమే ఈ క్షణమే’ అనే రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంది. ఇక ఎవరో పక్క నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది. దీంతో ఇద్దరూ భయపడి కౌగిలించుకుంటారు. రాజ్, కావ్యలు ఇద్దరూ సరసంలో మునిగి తేలుతారు. ఆ తర్వాత రాజ్, కావ్యలు ఇద్దరూ ఒక్కటి అవుతారు.

ఇవి కూడా చదవండి

రాజ్, కావ్యల కోసం అపర్ణ ఎదురు చూపులు..

మరోవైపు రాజ్, కావ్యల కోసం బెడ్‌ రూమ్ రెడీ చేసి ఉంచుతారు అపర్ణ, ఇందిరా దేవిలు. ఇంత రాత్రి అయినా ఇంకా రాలేదంటి? ఫోన్ చేయమంటారా? అని అపర్ణ కంగారు పడుతుంది. చాల్లే ఊరుకో వయసులో ఉన్న పిల్లలు.. అలా డిన్నర్ తినేసి వచ్చేస్తారా? అలా సరదాగా తిరిగి వస్తారు. ఇప్పుడు మనం ఇచ్చే ఈ థ్రిల్‌కి షాక్ అయిపోవాలి అని ఇందిరా దేవి అంటుంది. అదేమో కానీ.. ఇన్నాళ్లూ నేను కావ్యని చాలా మోసం చేస్తూ వచ్చానని అపర్ణ బాధ పడుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments