Saturday, December 28, 2024
Google search engine
HomeUncategorizedBrahmamudi, July 19th Episode: ఇక ఇప్పట్లో ఫస్ట్ నైట్ లేనట్లే.. రుద్రాణి స్కెచ్ మామూలుగా...

Brahmamudi, July 19th Episode: ఇక ఇప్పట్లో ఫస్ట్ నైట్ లేనట్లే.. రుద్రాణి స్కెచ్ మామూలుగా లేదుగా

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్, కావ్యల శోభనం ఇక ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. వీళ్ల ఫస్ట్ నైట్ అనే సరికి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉన్నాయి. ఒక వైపు ఇందిరా దేవి, మరోవైపు అపర్ణా దేవి రాజ్, కావ్యలను కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు. కానీ అన్నీ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. చివరికి గురువారం రాత్రి కావ్యకి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అపర్ణ. పెళ్లి అయిన ఆడపిల్ల బతుకు పండాలని, కడుపు పండాలని అర్థమయ్యేలా చెప్పింది. వెళ్లు ఇకనైనాన నీ జీవితం గురించి పట్టించుకోమని చెప్పింది. మగవారు ఆయనకు ఉండాలి కానీ ఆడ పిల్లను నేను ఎలా ఈ విషయం గురించి మాట్లాడతానని అంటుంది కావ్య.

కొట్లాడుకున్న ప్రేమ జంట..

మొత్తం మీద పెద్దావిడ, అపర్ణ చెప్పిన మాటలకు ఎంతో ఆవేశంగా బెడ్ రూమ్‌లోకి వచ్చిన కావ్య, రాజ్‌లు ఫస్ట్ నైట్ సంగతి మర్చిపోయి.. కొట్లాడుకున్నారు. ఇక తెల్లవారుతుంది. ఇగోయిస్టిక్ పర్సన్ అయిన రాజ్.. కోపంగా ఉన్నా కావ్యని కలవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తన మనసులో మాట చెప్పడానికి ఈ రోజు డిన్నర్‌కి రమ్మని చెప్తాడు. సరే మీరు ఇన్ని రకాలుగా పిలుస్తున్నారు కాబట్టి వస్తాను అని అంటుంది కావ్య. వీళ్లిద్దరు మాట్లాడుకున్నది మొత్తం రుద్రాణి దొంగ చాటుగా వినేస్తుంది.

రాజ్, కావ్యల డిన్నర్ ప్లాన్ ఫ్లాప్.. రుద్రాణి స్కెచ్..

వెంటనే రాహుల్ దగ్గరకు వచ్చి ప్లాన్ అమలు చేస్తుంది. ఇప్పటివరకూ రాజ్, కావ్యలు విడివిడిగా ఉంటేనే మన ప్లాన్స్ ఏమీ సాగలేదు. అలాంటిది వీళ్లిద్దరూ కలిసి ఒక్కటైపోతే.. ఇక మన పని అంతే అని అంటుంది. రాజ్ కావ్యకి దగ్గర అవ్వాలని, ఈ రోజు తన మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నాడు. అందుకు ఈ రోజు డిన్నర్ ప్లాన్ చేశాడు. రాజ్, కావ్యలు కలవకూడదని రుద్రాణి చెప్తుంది. అమ్మో అలా అయితే ఆఫీస్ పనులు మళ్లీ మొత్తం రాజ్ చూసుకుంటాడు. అప్పుడు నా పని ఏంటి? రాజ్‌ని ఎలాగైనా ఆ డిన్నర్‌కి వెళ్లకుండా ఆపాలి. వెంటనే ప్లాన్ చేస్తాను అని రాహుల్ అంటాడు. రాహుల్, రుద్రాణిలు ప్లాన్ చేశారంటే ఖచ్చితంగా రాజ్, కావ్యలు కలవరు. మరి రాహుల్ ఏం చేస్తాడు? రాజ్ తన మనసులో మాట కావ్యతో చెప్తాడో లేదో.. వీళ్ల వ్యవహారం చూస్తే మొత్తానికి రాజ్, కావ్యలు అప్పుడే కలిసేట్టుగా కనిపించడం లేదు. మళ్లీ కథ మొదటికి వచ్చేలా ఉంది.

ఇవి కూడా చదవండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments