Brahmamudi, July 16th Episode: ఈ రోజు ఎపిసోడ్‌లో అంతా అయోమయం గందరగోళం.. నవ్వులే నవ్వులు..

0
24
Brahmamudi, July 16th Episode: ఈ రోజు ఎపిసోడ్‌లో అంతా అయోమయం గందరగోళం.. నవ్వులే నవ్వులు..

Brahmamudi, July 16th Episode: ఈ రోజు ఎపిసోడ్‌లో అంతా అయోమయం గందరగోళం.. నవ్వులే నవ్వులు..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో..‌ కామెంట్ చేసిన వాళ్లను అప్పూ చితకొడుతుంది. దీంతో పోలీసులు అప్పూని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత స్టేషన్ ఎస్ఐ అప్పూకి క్లాస్ పీకుతాడు. చాలా చీప్‌గా కామెంట్ చేశారని అప్పూ అంటుంది. వాళ్లు వెధవలే.. కానీ వాళ్లను కొట్టే హక్కు మీకు లేదు. వాళ్లను అలాగేనా కొడతారు.. కామెంట్ చేస్తే మాకు చెప్పాలి. అప్పుడు నీ ప్లేస్‌లో వాళ్లు ఉండేవారు కదా.. అంత ఆవేశం ఎందుకు? అని అంటాడు. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్‌ని చూసిన అప్పూ.. రేయ్ బంటి వీడికెందుకు కాల్ చేశావురా? అని అప్పూ అంటుంది. ఇదిగో అన్న వీళ్లే అప్పూ గురించి కామెంట్ చేశారని బంటీ చెప్తాడు. దీంతో కవి ఆవేశంతో కానిస్టేబుల్ కర్ర తీసుకుని.. కామెంట్ చేసిన వాళ్లను కొడతాడు. దీంతో ఎస్ఐ ఆపి.. ఏంటయ్యా నీ ఉద్దేశం వీళ్లను ఎందుకు కొడుతున్నావ్? అని వీడిని కూడా లోపల వేయండయ్యా అని ఎస్ఐ అంటాడు.

కళ్యాణ్‌ని అరెస్ట్ చేసిన ఎస్ఐ..

అసలు నేను ఎవరో తెలుసా? అని కళ్యాణ్ అంటే.. నీకు తెలీదా ఆవేశంలో మర్చిపోయావా? అని అంటాడు. నీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వు కొడుకుని ఇలాగేనా పెంచుతారు? నెంబర్ ఇవ్వు అని ఎస్ఐ అంటే.. కళ్యాణ్ రాజ్ నెంబర్ ఇస్తాడు. ఆ తర్వాత.. రాజ్‌కి కావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఈ సమయంలో నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావ్? అని రాజ్ అంటే.. ఆహా ఇప్పుడు మీకు స్త్రీల సమస్యలు గుర్తుకువచ్చాయా? పండక్కి అల్లుడు వచ్చి వెళ్లినట్టు ఇలా చూపించడం కాదు. ఈ కేరింగ్ ఎప్పుడూ ఉంటే బావుంటుందని కావ్య అంటుంది. ఇదిగో నీతో ఇదే చిక్కు అని రాజ్ అంటాడు.

మీ కొడుకుని అరెస్ట్ చేశామంటూ రాజ్‌కి ఫోన్..

అప్పుడే రాజ్‌కి ఎస్ఐ ఫోన్ చేస్తాడు. రాజ్ అంటే మీరేనా? నేను జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నా.. అని ఎస్ఐ చెప్తాడు. అవునా ఏమైంది? అని రాజ్ అంటే.. ఏవయ్యా పెద్ద మనిషి.. కొడుకును కనడమే కాదయ్యా.. పెంచడం కూడా నేర్చుకోవాలి. ఇలాగే రౌడీలా పెంచుతారా? ఎవర్నీ లెక్క చేయకుండా పెంచుతారా? అని అంటాడు ఎస్ఐ. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలీడం లేదని రాజ్ అంటాడు. నీకు అర్థమైతే నీ కొడుకు ఇలా ఎందుకు తయారవుతాడు. ఒక పిల్ల ఒక అబ్బాయి తల పగలకొట్టి అరెస్ట్ అయితే.. ఆ పిల్ల కోసం వచ్చిన నీ కొడుకు కానిస్టేబుల్‌ని కొట్టాడు. ఇలాగేనా పెంచేది.. అసలు భయమే లేదు మీ అబ్బాయికి అని పోలీస్ అంటాడు.

అంతా అయోమయం.. గందరగోళం..

ఇదేమీ అర్థం కాని రాజ్.. మీరు చెప్పేది బాగానే ఉంది. నాకు ఒక కొడుకు ఉండి ఉంటే ఇంకా బాగుండేది. నాకు అసలు కొడుకే లేడని రాజ్ అంటాడు. ఈలోపు కావ్య అందుకుంటుంది. ఏంటి మీకు ఓ కొడుకు ఉన్నాడా? మళ్లీ మన కథ మొదలకు వచ్చిందా? అని కావ్య అంటుంది. నోర్ముయ్ అని రాజ్ అంటే.. ఏంటి నన్నే నోరు మూయమంటావా? అని ఎస్ఐ అనుకుంటాడు. ముందు అతని పేరు చెప్పమని రాజ్ అంటే.. ఏంటయ్యా నీకు నీ కొడుకు పేరు కూడా తెలీదా? ఇప్పటి వరకూ పేరు కూడా పెట్టలేదా? అని అంటాడు ఎస్ఐ. అప్పుడే బంటీ.. అతని పేరు కళ్యాణ్ అని చెప్తాడు. కళ్యాణ్ అంట అని చెప్తాడు ఎస్ఐ. ఏంటి కళ్యాణ్‌ని అరెస్ట్ చేశారా.. ఎందుకు? నీకు ఎంత ధైర్యం? అని రాజ్ అంటే.. మాటిమాటికీ చెప్పను వెంటనే రమ్మని ఎస్ఐ ఫోన్ పెట్టేస్తాడు. ఇక రాజ్ హడావిడిగా బయలు దేరతాడు. ఉండండి నేను కూడా వస్తాను అని కావ్య అంటే.. నువ్వా ఏం చేస్తావ్? అక్కడ గట్టిగా మాట్లాడాలి నువ్వు అలా మాట్లాడలేవు. నేను ఏదైనా డీల్ చేయగలనని రాజ్ అంటాడు. సరే చూసుకుందామని కావ్య అంటుంది.

రాజ్‌ని కూడా అరెస్ట్ చేసిన పోలీసు..

ఇక రాజ్ హడావిడిగా పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. మీరేనా వాళ్లను అరెస్ట్ చేసిందని రాజ్ అడిగితే.. మీరేంటి ఇంత చిన్నయ ఉంది? అని పోలీస్ అంటాడు. ఎహే నేను వాళ్ల అన్నయ్యను. నా తమ్ముడిని అరెస్ట్ చేస్తావా? నీకు ఎంత ధైర్యం అని రాజ్ అంటాడు. ఏంటి నీ తమ్ముడు ఏమన్నా పై నుంచి దిగి వచ్చాడా? ఎక్కువ మాట్లాడితే నాలుగు తగిలిస్తాను. ఆల్రెడీ నాలుగు తగిలించానని పోలీస్ అంటే.. రేయ్ అని ఆవేశంతో రాజ్.. ఎస్ఐ కాలర్ పట్టుకుంటాడు. నా తమ్ముడిని కొడతావా? అని పోలీస్ చెంప మీద కొడతాడు. దీంతో రాజ్‌ని కూడా తీసుకెళ్లి లాకప్‌లో పడేస్తాడు ఎస్ఐ. మేము ఎవరో తెలుసా? మా గురించి తెలిసే అరెస్ట్ చేశావా? అని రాజ్ అంటూ.. కమిషనర్‌కి కాల్ చేస్తానంటాడు. అప్పుడే ఫోన్ లాక్కోమని చెప్తాడు ఎస్‌ఐ. బంటీ అదంతా ఆశ్చర్యంగా చూస్తాడు.

రంగంలోకి కావ్య..

మేము ఎవరో తెలిసే అరెస్ట్ చేశావా? అని రాజ్ అంటే.. వాడికి కూడా వాడెవడో తెలీదంట. మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి మీరు ఎవరో మర్చిపోయే రోగం ఉందా? అని పోలీస్ అంటాడు. వెంటనే బంటీ కావ్యకి కాల్ చేసి.. రాజ్ బావని అరెస్ట్ చేస్తాడని బంటీ చెప్తాడు. వెంటనే కావ్య బయలు దేరుతుంది. వెంటనే స్టేషన్‌కి వచ్చి.. నమస్తే సర్ అని అంటుంది. కూర్చో అమ్మా.. ఏం పని మీద వచ్చారు అని ఎస్ఐ అడుగుతాడు. లోపల ఉన్న ముగ్గురూ మా వాళ్లే అని కావ్య అంటుంది. నువ్వు ఎవర్ని కొట్టడానికి వచ్చావ్ అమ్మా అని ఎస్ఐ అంటాడు. మాది చాలా గొప్ప ఫ్యామిలీ.. నేను ఎలాంటి ఇన్ ఫ్లులెన్స్ ఉపయోగించ కుండా విడిపించడానికి వచ్చాను అని కావ్య అంటుంది.

ఎస్‌ఐని తికమక పెట్టిన కావ్య.. అమాయకపు పోలీస్..

మీరు ఎవరైనా సరే.. నేను వాళ్లపై క్రిమినల్ కేసు బుక్ చేశాను. వాళ్లను అసలు విడిచి పెట్టే ప్రసక్తే లేదని అంటాడు ఎస్ఐ. అయితే మీరు వాళ్ల దగ్గర లక్ష రూపాయలా లంచం తీసుకున్నారని కావ్య కావాలనే అబద్ధం చెప్తుంది. దీంతో షాక్ అవుతాడు ఎస్ఐ. లంచం తీసుకున్నారని కావాలనే బల్ల గుద్ది చెబుతుంది కావ్య. నేను లంచం తీసుకోలేదని ఎస్ఐ కూడా బల్ల గుద్ది చెప్తాడు. చూశారా మీరు చేయలేని తప్పు చేశారంటే ఎంత ఆవేశం వచ్చిందో.. అలాగే మా చెల్లిన కూడా వాళ్లు ఎంతలా కామెంట్ చేసి ఉంటే అంతలా కొట్టి ఉంటుందో ఆలోచించారా? దీనంతటికీ కారణం మీరే. ఇప్పుడే వాళ్లు ముగ్గురూ వెధవలని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని కావ్య అంటుంది. రేయ్ మీరు బస్తీ వాళ్లే కదా.. జరిగినదంతా వీడియో రికార్డ్ చేశావ్ కదా చూపించు అని కావ్య అంటే.. బంటీ కూడా యాక్ట్ చేస్తాడు. ఇక ఆ ముగ్గురూ తప్పును ఒప్పుకుంటారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here