ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పని మనిషి శాంతాను జ్యూస్ తీసుకురమ్మని అంటుంది రుద్రాణి. శాంతా కట్టుకున్న చీరని చూసి రాజ్, కావ్య, సుభాష్‌లు షాక్ అవుతారు. ఏంటే నీకు ఇంత ఖీరీదైన చీర ఎక్కడిది అని రుద్రాణి ఏమీ తెలియనట్టు అడుగుతుంది. ఇవాళ పెళ్లి రోజని అమ్మగారు డబ్బు, ఈ చీర ఇచ్చారని చెబుతుంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత ఖరీదైన చీర ఇవ్వలేదే అని కావాలనే అపర్ణను దెప్పి పొడుస్తుంది రుద్రాణి. ఇప్పుడు ఇచ్చాను.. నీకేమైనా అభ్యంతరమా అని అపర్ణ అంటుంది. ఆ తర్వాత సుభాష్, అపర్ణలు కేక్ కట్ చేస్తారు. సుభాష్ వెళ్లి పోతుండగా.. రాజ్ ఆపుతాడు. ఇక ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తుండగా.. అపర్ణ సీరియస్‌గా సుభాష్ వైపు చూసి.. మళ్లీ నవ్వుతుంది. అప్పుడే కావాలనే మాయ విషయం తీసుకొస్తుంది రుద్రాణి.
సంతోషంలో అపర్ణ.. చిచ్చు రాజేసిన రుద్రాణి..
అపర్ణ ఆంటీ చేతిలో ప్లాస్టిక్ కత్తి ఉంది కాబట్టి సరిపోయింది కాబట్టి బతికి పోయారు. అదే నిజమైన కత్తి అయి ఉంటేనే నా సామిరంగా.. అని స్వప్న అనబోతుండగా.. రాహుల్ ఆపుతాడు. అసలు నువ్వు ఒక మనిషివేనా రుద్రాణి? అని ఇందిరా దేవి తిడుతుంది. ఎందుకు మీకు ఇప్పుడు అది గుర్తుకు వచ్చింది? అంటే అత్తయ్య సంతోషంగా ఉండటం మీకు నచ్చదు. జరిగిపోయినవి అన్నీ గుర్తుకు చేసి మనసు పాడు చేయడం అవసరమా? అని కావ్య తిడుతుంది. ఆ తర్వాత ప్రకాశం కూడా రుద్రాణిని తిడతాడు. అయినా పట్టించుకోని రుద్రాణి.. మళ్లీ అలానే మాట్లాడుతుంది. మమ్మీ కేక్ కట్ చేయమని రాజ్ అంటే.. కేక్ కట్ చేసి రాజ్‌కి తినిపిస్తుంది అపర్ణ. అది చూసి అందరూ షాక్ అవుతారు. రాజ్ పుట్టినప్పుడే నా జీవితానికి సార్థకత వచ్చిందని వచ్చింది. అందుకే మొదటి తినిపించానని అపర్ణ కవర్ చేస్తుంది. ఆ తర్వాత రాజ్ డల్‌గా అపర్ణ, సుభాష్‌లకు కేక్ తినిపిస్తాడు. ఆ తర్వాత అందరూ తినిపిస్తారు.
సుభాష్‌ని క్షమించని అపర్ణ..
ఆ తర్వాత సీన్ కట్ చేస్తే.. సుభాష్ గదిలోకి వచ్చి.. ఏం చేస్తున్నావ్? నువ్వు అని అడుగుతాడు. ప్రశ్న ఏంటి? కొన్ని చెప్పరు.. అర్థం చేసుకోవాలని అపర్ణ అంటుంది. నీకు చీర నచ్చలేదా? నేను ఇచ్చింది నచ్చలేదా? అని సుభాష్ అంటాడు. మీ నుంచి నేను ఏదైనా ఆశిస్తేనే కదా.. నచ్చడం నచ్చలేదు అని చెప్పడానికి అని అపర్ణ అంటుంది. చేసిన తప్పు ఒప్పుకుంటే.. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడితే కొంత మంది క్షమిస్తారు.. కానీ ప్రపంచంలో క్షమించని వాళ్లు ఎవరూ ఉండరని సుభాష్ అంటాడు. ప్రపంచం సంగతి నాకు అనవసరం. కానీ నిన్నమొన్నటి దాకా నువ్వే మీరే నా ప్రపంచం అనుకున్నాను. కానీ మొదటి సారి మోసాన్ని చూశాను. నా సౌభాగ్యాన్ని దోచి పెట్టి.. చీర కొనిస్తే నేను క్షమిస్తాను అనుకుంటున్నారా? మీరు మోసం చేసినా క్షమించాలా? క్షమించమంటే క్షమించాలా? దీన్ని అహంకారం అనక ఏం అంటారని.. అపర్ణ నిలదీస్తుంది. ఇంట్లో అందరూ మనం కలిసి పోయాం అనుకుంటున్నారని సుభాష్ అంటే.. ఈ ఇంటి పెద్ద కోడలు అయిన నాకు గౌరవం లేకుండా పోయిన మీతో ఇంత సేపు చర్చించాల్సిన అవసరం లేదు. మీకు ఈ వయసులో తాత్కాలిక సుఖం అవసరం అయింది. అందుకే శాపం తగిలింది. నేను ఎన్ని ప్రశ్నలు వేసినా.. మీ దగ్గర సమాధానం చెప్పలేరని అపర్ణ అంటుంది. దీంతో సుభాష్ అక్కడి నుంచి వెళ్లి పోతాడు.
ఇవి కూడా చదవండి
మీ జీవితం మీరు చూసుకోమని చెప్పిన సుభాష్..
సుభాష్ బయటకు వచ్చేటప్పటికి రాజ్, కావ్యలు బయట ఉంటారు. మమ్మీ ఎందుకు వెళ్లి పోయిందని రాజ్ అడుగుతాడు. మీ అమ్మ చాలా సంతోష పడుతుందని సుభాష్ అబద్దం చెప్తాడు. మమ్మీ మీతో కలిసిపోలేదా డాడీ అని రాజ్, కావ్యలు అడుగుతారు. సుభాష్ కవర్ చేస్తూ ఉండగా.. కావ్య చీర గురించి అడుగుతుంది. మా కోసం ఇద్దరూ నటించారా? అని రాజ్ అడుగుతాడు. చెప్తే మీరు ఏం చేస్తారు? వెళ్లి మీ పని మీరు చూసుకోమని సుభాష్ అంటాడు. ఇది మా అమ్మానాన్నలకు సంబంధించిన సమస్య అని రాజ్ అంటాడు. మీ అమ్మ మాయకు నాకు మధ్య ఉన్న సంబంధం గురించి మర్చిపోలేక పోతుంది. తప్పు చేసింది నేనే కాబట్టి ఆ కోపాన్ని సహించాలి. మీ గురించి మీరు ఆలోచించారా.. ఇంట్లోని అందరి గురించి ఆలోచిస్తూ ఎలా? మీకంటూ ఓ జీవితం లేదా? అందరి బాధలు నెత్తిన వేసుకుని మనశ్శాంతి లేకుండా బతుకుతారా? మీ జీవితం గురించి ఆలోచించమని సుభాష్ చెప్తాడు.
మావయ్య గారు ఇచ్చిన చీర పని మనిషికి ఇవ్వడం కరెక్టేనా?
ఆ తర్వాత అపర్ణతో మాట్లాడటానికి కావ్య వస్తుంది. అత్తయ్యా.. మీరెందుకు మధ్యలో ఎందుకు వచ్చేశారు? అని కావ్య అడుగుతుంది. నా ఇష్టం.. అడగటానికి నువ్వు ఎవరు? అని అపర్ణ అంటుంది. మీ కొడుకు భార్యని అని కావ్య అంటుంది. నువ్వు ఈ ఇంటికి కోడలివి మాత్రమే.. నా వ్యక్తిగత విషయాల్లో దూరమని చెప్పలేదని అపర్ణ అంటుంది. మావయ్య గారు మీరు కొనిచ్చిన చీర పని మనిషికి ఇవ్వడం కరెక్టేనా? అని అడుగుతుంది కావ్య. బయటకు వెళ్లిన ఆ మనిషి నిన్ను పంపించాడా? అని అపర్ణ అంటుంది. మీరు ఇలా చేయడం చాలా తప్పు అని కావ్య అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.