Friday, December 27, 2024
Google search engine
HomeUncategorizedBrahmamudi, July 11th Episode: 'నిన్ను ఎప్పటికీ క్షమించను' అపర్ణ.. షాక్‌లో కావ్య, రాజ్‌లు..

Brahmamudi, July 11th Episode: ‘నిన్ను ఎప్పటికీ క్షమించను’ అపర్ణ.. షాక్‌లో కావ్య, రాజ్‌లు..

Brahmamudi, July 11th Episode: ‘నిన్ను ఎప్పటికీ క్షమించను’ అపర్ణ.. షాక్‌లో కావ్య, రాజ్‌లు..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పెళ్లి రోజున అపర్ణ రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే పని మనిషి వచ్చి. ఏంటి అమ్మగారూ పిలిచారంట అని అడుగుతుంది. సుభాష్ గిఫ్ట్‌గా చీరను, డబ్బును పని మనిషికి ఇస్తుంది. ఈ రోజు మా పెళ్లి రోజు తీసుకో అని అంటుంది. ఇంత ఖరీదైన చీర నాకెందుకు అమ్మా అని అంటే.. నీకు కూడా మంచి ఖరీదైన చీర కట్టుకోవాలని ఉంటుంది కదా తీసుకో అని అపర్ణ అంటే.. పని మనిషి తీసుకుంటుంది. నా మనసు కరగదు.. నిన్ను క్షమించను అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాలులో ఒక చోటుకు చేరుకుంటారు.

రుద్రాణి కన్నింగ్ మాటలు.. స్వప్న చివాట్లు..

ఏంట్రా ఇవి అని ప్రకాష్ అంటాడు. ఇవాళ ప్రత్యేకమైన రోజు.. అమ్మా, నాన్నల మ్యారేజ్ డే అని కావ్య, రాజ్‌లు చెప్తారు. దీంతో అందరూ సుభాష్, అపర్ణలకు విష్ చేస్తారు. ఇన్ని గొడవలు జరిగినా ఇద్దరూ బాగానే కలిసి పోయారే అని రుద్రాణి అంటే.. స్వప్న చివాట్లు పెడుతుంది. ఇక ఆ తర్వాత కళ్యాణ్‌ కూడా విష్ చేస్తాడు. అనామిక చేసిన మోసాన్ని మర్చిపోవడానికి కళ్యాణ్‌ని హోస్ట్‌గా చేస్తాడు. కళ్యాణ్ చేత ఆడించాలని చెప్తాడు రాజ్. సరే అని అంటాడు కళ్యాణ్. ఇవాళ అమ్మా నాన్నల పెళ్లి రోజు. ఇన్ని సంవత్సరాల కాపురంలో ఒకరిని మరొకరు అర్థం చేసుకుని ఉంటారు. కాబట్టి ఈ రౌండ్‌కి ఒక పేరు పెట్టాను. నీ మనసు నాకు తెలుసు అని రాజ్ అంటాడు. అమ్మమ్మ, తాతయ్యలు జడ్జీలుగా ఉంటారని కావ్య అంటుంది.

‘నిన్నే ప్రేమిస్తా’ అని సుభాష్‌కు చెప్పి అపర్ణ..

గేమ్ ఎలా ఆడాలో కళ్యాణ్ వివరిస్తాడు. ఇక ఆటలు మొదలవుతాయి. ఆ తర్వాత ఇందిరా దేవి, సీతా రామయ్య భార్య భర్తల ప్రేమ గురించి వివరిస్తారు. ఎప్పటికైనా చివరికి భర్తే తోడుగా ఉంటాడని అంటారు. కాబట్టి భార్యాభర్తల మధ్య ప్రేమ గొప్పది అని ఇద్దరూ చెప్తారు. ఇక ఆట మొదలవుతుంది. ముందుగా అపర్ణ, సుభాష్‌లు గేమ్ స్టార్ట్ చేస్తారు. అపర్ణకు ఇందిరా దేవి ‘నిన్నే ప్రేమిస్తా’ అని చెవిలో చెప్తుంది. దాన్ని సుభాష్‌కు అర్థమయ్యేలా చెప్తుంది అపర్ణ. చివరికి సమాధానం చెప్తాడు సుభాష్. ఆ తర్వాత ధాన్య లక్ష్మి – ప్రకాశం, స్వప్న – రాహుల్, కావ్య – రాజ్‌లు ఆడతారు. ఎవరూ సమాధానం సరిగ్గా చెప్పరు. దీంతో ఈ గేమ్‌లో అపర్ణ, సుభాష్‌లు గెలుస్తారు.

సరైన జవాబు చెప్పిన అపర్ణ, సుభాష్‌లు..

ఆ తర్వాత మరో రౌండ్ మొదలు పెడతారు. ఈ రౌండ్‌లో ఇద్దరూ ఒకరికి సంబంధించిన ప్రశ్న ఇంకొకరిని అడుగుతాం. అది ఈ బోర్డు మీద రాయాలి. మరొకరు అది చూడకుండా చెప్పాలి అని అంటారు. ఇక ముందుగా అపర్ణ, సుభాష్‌లు స్టార్ట్ చేస్తారు. డాడీ మీతో మొదటగా మాట్లాడిన మాట ఏంటి? అని అది బోర్డు మీద రాయాలి అని రాజ్ చెప్తాడు. ఇక అపర్ణ, సుభాష్‌ల కళ్లకు గంతలు కడతారు. అపర్ణ, సుభాష్‌లు కరెక్ట్‌గా సమాధానం చెప్తారు. ఆ తర్వాత సేమ్ సుభాష్‌కి సంబంధించిన ప్రశ్న అడుగుతారు. అపర్ణ కరెక్ట్‌గా చెప్తారు. దీంతో అందరూ సంతోష పడతారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments