Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

0
26
హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

బిగ్ బాస్ సీజన్ 8 కోసం  తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందుకు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఆగస్టు లో బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కానుంది. అలాగే ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా.. ఆతర్వాత సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. తనదైన యాంకరింగ్ తో నాగ్ బిగ్ బాస్ ను తన భుజాలపై నడుపుతున్నారు. ఇక ఇప్పుడు సీజన్ 8 ప్రారంభం కానుండటంతో హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారు.? ఈసారి టాస్క్ లో ఎలా ఉండబోతున్నాయి.? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్ సినిమా కోసం పాకిస్థాన్ హీరోయిన్‌ను దింపుతున్నారా.?

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనే వారు వీరే అంటూ గతకొద్దిరోజులుగా కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లలో.. రీతూ చౌదరి, వేణు స్వామి, కిరాక్ ఆర్పీ, కుమారి ఆంటీ, బుల్లెట్ భాస్కర్, బర్రెలక్క, చమ్మక్ చంద్ర, సురేఖావాణి లేదా ఆమె కుమార్తె సుప్రీత, అమృత ప్రణయ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. అలాగే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకు ఆమె ఎవరు అంటే..

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగచైతన్యకు అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్ ఈమె..

ఆమె పేరు కుషిత కల్లాపు. ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయింది. అప్పట్లో టిక్‌టాక్ వీడియోలతో తెగ ట్రెండింగ్‌లో ఉండేది. ఆతర్వాత మెల్లగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో ఈ చిన్నది నటించింది. కానీ ఆ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేశారు. ఇక బిగ్ బాస్ ఫెమ్ అర్జున్ హీరోగా నటించిన బాబు అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగు పెడుతుందని తెలుస్తోంది. కుషిత కల్లాపు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం దాదాపు ఖాయం అంటున్నారు. అటు బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయం. కుషిత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిగ్ బాస్ లోకి కుషిత ఎంట్రీ పై త్వరలోనే క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here