Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి ‘మొగలి రేకులు’ ఇంద్రనీల్..  సీరియల్ బ్యాచ్‌ని గట్టిగానే దింపుతున్నారుగా

0
25
బిగ్‌బాస్‌లోకి

బుల్లితెర ప్రేక్షకులకు బోలెడు వినోదాన్ని అందించేందుకు బిగ్ బాస్ మళ్లీ రెడీ అవుతున్నారు. ఈసారి మరిన్ని ఫన్ ఎలిమెంట్స్ తో, పక్కాగా ఎంటర్ టైన్ చేసే కంటెస్టెంట్స్ తో మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ తెలుగు. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కు కూడా రంగం సిద్ధమైంది. ఆగస్టు మూడో వారం నాలుగో వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 8కి సంబంధించిన ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా రానుందని, దానితో పాటు ప్రోమో కూడా రిలీజ్‌ కానుందంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. మరోవైపు ఈ సారి హౌజ్ లోకి వచ్చే కంటెస్టెంట్ల వివరాలకు సంబంధించి పలు జాబితాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సారి హౌస్ లో ‘చక్రవాకం’, ‘మొగలి రేకులు’ సీరియల్స్ ఫేం, నటుడు ఇంద్రనీల్‌ సందడి చేయనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ సీజన్ 8 కోసం ఇంద్రనీల్ ను సంప్రదించారని, రెమ్యునరేషన్ డీల్ కూడా నచ్చడంతో బుల్లితెర నటుడు ఒకే చేశాడని టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

దీంతో ఈ సారి హౌజ్‌లో సందడి చేసే సీరియల్ కంటెస్టెంట్స్‌ లిస్టులో ఇంద్రనీల్‌ వర్మ కూడా ఉన్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావాల్సిందే. ఎందుకంటే షో లాంఛింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయదు బిగ్ బాస్.

భార్యతో నటుటు ఇంద్రనీల్ వర్మ..

మరోవైపు బ్రహ్మముడి ఫేం కావ్య అలియాస్ దీపిక రంగరాజు ను కూడా బిగ్ బాస్ టీమ్ కలిసిందని వార్తలు వస్తున్నాయి. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎక్కడైనా ఎంతో చలాకీగా కనిపించే దీపికను బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకు వస్తే షోకు గ్లామర్ టచ్ తో పాటు మంచి ఫన్ జనరేట్ అయ్యే అవకాశముందని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తోంది. చూద్దాం మరి ఈ సారి ఎవరెవరు హౌజ్ లోకి అడుగుపెడతారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here