Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో టీమిండియా క్రికెటర్.. స్కెచ్ మాములుగా లేదుగా

0
16
Ambati Rayudu Family

బిగ్ బాస్ 8 త్వరలో ప్రారంభం కాబోతుంది. సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో.. సీజన్ 8 కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే.. ఆగస్టులో.. మస్ట్ మజా ఎంటర్టైన్‌మెంట్ షురూ అవ్వొచ్చు. గతంలోలా కంటెస్టెంట్స్ నేమ్స్ రివీల్ అవ్వకుండా టీమ్ జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కొందరి పేర్లు మాత్రం బాగా ప్రచారం అవుతున్నాయి. వాస్తవానికి సీజన్ కిక్ అవ్వాలంటే.. కంటెస్టెంట్స్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. షోలో అన్ని రకాల ఎమోషన్స్ కలబోసి.. వీక్షకులకు ఫుల్ మీల్స్‌లా ఉండాలి. అందుకే ఈ సారి బిగ్ బాస్ టీమ్.. ఆచి తూచి.. కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఓ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తీసుకొచ్చేందుకు టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌కు కంప్లీట్‌గా గుడ్ బై చెప్పిన రాయుడు.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. తొలుత వైసీపీలో చేరి.. పది రోజుల తిరగకుండానే.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. తర్వాత జనసేనలో చేరాడు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించాడు. అయితే రాయుడు ఆటలోనే కాదు బయట కూడా చాలా దూకుడు స్వభావంతో ఉంటాడు. పలుసార్లు ప్లేయర్లతో పాటు అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు మేనేజ్మెంట్‌పై సైతం తన ఆగ్రహాన్ని బాహాటంగా వెళ్లగక్కాడు.

దీంతో రాయుడు ఉంటే.. కంటెంట్‌కు కొరత ఉండదని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో రాయుడు ఉంటే షోకి.. యూనివర్శిల్ అప్పీల్ వస్తుంది. అందుకే రెమ్యూనరేషన్ ఎంతైనా సరే.. ఆయన్ను ఒప్పించేందుకు బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం మనీ కోసమే అయితే.. రాయుడు వచ్చే అవకాశం లేదు. అతని మనసు ప్రస్తుతం పాలిటిక్స్‌పై ఉంది. అయితే కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేయాలని రాయుడు భావిస్తే.. మాత్రం అతను ఓకే చెప్పే అవకాశం ఉంది.

Ambati Rayudu Family

Ambati Rayudu Family

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here