Saturday, January 4, 2025
Google search engine
HomeUncategorizedBigg Boss 8 Telugu: బిగ్‏బాస్ సీజన్ 8లోకి తెలుగు యాంకర్.. బుల్లితెర బ్యూటీకి క్రేజీ...

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ సీజన్ 8లోకి తెలుగు యాంకర్.. బుల్లితెర బ్యూటీకి క్రేజీ ఛాన్స్..

సోషల్ మీడియాలో బిగ్‏బాస్ రియాల్టీ షో సందడి మొదలైంది. కొన్నిరోజులుగా తెలుగు బిగ్‏బాస్ సీజన్ 8 గురించి అనేక రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ మొదటివారంలోనే ఈ షో స్టార్ట్ కావాల్సి ఉండగా.. ఈసారి కాస్త ముందుగానే అంటే ఆగస్టులోనే ఈ షోను ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. ఇప్పటికే కంటెస్టెంట్స్ కూడా ఫిక్స్ అయ్యారని.. ఇంకా పలువురు సెలబ్రెటీలతో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈసారి బిగ్‏బాస్ సీజన్ 8లో సీరియల్ యాక్టర్స్ హావా ఎక్కువగా ఉండనుందని.. అలాగే పలువురు యాంకర్స్, సోషల్ మీడియా ఇన్‎ఫ్లూయేన్సర్స్ కూడా ఉండనున్నారని టాక్ నడుస్తుంది. ఇప్పటికే పలువురి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కుమారీ ఆంటీ, అమృత ప్రణయ్, బర్రెలక్క, యూట్యూబర్ నిఖిల్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో సెలబ్రెటీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

బుల్లితెరపై తనదైన యాంకరింగ్ ద్వారా ఫేమస్ అయిన వర్షిణి కూడా ఈసారి బిగ్‏బాస్ సీజన్ 8లోకి ఎంటర్ కానుందట. ఇక ఈ అమ్మడు హౌస్ లోకి అడుగుపెడితే రచ్చ మాములుగా ఉండదు. ఇప్పటికే పలు షోలలో తన కామెడీ, తెలుగు డైలాగ్ తో అలరించింది. వచ్చి రానీ తెలుగులో మాట్లాడుతూ అల్లరి చేసింది. ఇప్పటికే ఢీ డాన్స్ షోలో హోస్టింగ్ చేసింది.

కేవలం బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషించింది. అయితే యాంకర్ వర్షిణికి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ బ్యూటీ ఏ పోస్ట్ చేసినా ఏదోక కారణంపై ట్రోల్ చేస్తుంటారు. గతంలో ఐపీఎల్ క్రికెట్ సమయంలో యాంకర్ వర్షిణి పేరు నెట్టింట మారుమోగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈసారి బిగ్‏బాస్ హౌస్ లోకి ఓ క్రికెటర్ కూడా రాబోతున్నాడట. ఇప్పటికే నిర్వాహుకులు అతడితో సంప్రదింపులు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. ఇటీవలే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు. మొదట్లో వైసీపీలో చేరిన అంబటి రాయుడు.. ఆ తర్వాత జనసేనలో చేరాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments