Bigg Boss 8: బిగ్ బాస్‌లోకి పంపండి.. అందరికి తలనొప్పి తెప్పిస్తానంటున్న నెత్తిమీద జట్టు లేనోడు..!

0
43
ఇదెక్కడి పిచ్చిరా నాయన...

తెలుగు బిగ్ బాస్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఏడూ సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ రియాలిటీ గేమ్ షో.. బిగ్ బాస్ సీజన్ 7 కు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు బిడ్డగా హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్ గా తిరిగొచ్చాడు. తొలిసారి సామాన్యుడు విజేతగా నిలవడంతో బిగ్ బాస్ సీజన్ 7కి మంచి టీఆర్పీ వచ్చింది. హౌస్ లో పల్లవి ప్రశాంత్ పై సీరియల్ బ్యాచ్ చేసిన గొడవలు, శివాజీ సపోర్ట్ ఇలా నానా రచ్చ జరిగింది బిగ్ బాస్ హౌస్ లో అన్న నన్ను బిగ్ బాస్ కు పంపించండి అన్న అంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు షేర్ చేసేవాడు పల్లవి ప్రశాంత్. ఇన్ స్టా గ్రామ్ వేదికగా రైతు బిడ్డను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడని అన్న అంటూ ఎప్పటి నుంచో వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకున్నాడు ప్రశాంత్.

ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ యాజమాన్యంతో పాటు నాగార్జున కూడా పల్లవి ప్రశాంత్ ను ప్రోత్సహించారు. హౌస్ లో టాస్క్‌లు బాగా ఆడి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ప్రశాంత్. అలాగే ముందుగా మనోడు హౌస్ లో రతికా రోజ్ తో లవ్ ట్రాక్ నడపడం.. ఆ తర్వాత ఆమెను అక్క అనిపిలవడం అలాగే హౌస్ లో అమర్ దీప్ తో గొడవలు.. శివాజితోనే ఉంటూ ఆయన చెప్పినట్టే చేయడం ఇలా ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాబ్ చేశాడు ప్రశాంత్. ఏదైతే ఏం మొత్తానికి పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు.

ఇక ఇప్పుడు చాలా మంది పల్లవి ప్రశాంత్ లా వీడియోలు చేస్తూ మమ్మల్ని బిగ్ బాస్ కు పంపండి అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో నెత్తిమీద బొచ్చు లేనోడు అని ఓ వ్యక్తి కూడా తనను బిగ్ బాస్ సీజన్ 8కు పంపాలి అంటూ ఓ వీడియో చేశాడు. ఆల్ ఇండియా అందగాడు రవి అనే పేజ్ నుంచి ఓ వ్యక్తి ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నన్ను సపోర్ట్ చేసి బిగ్ బాస్ 8 కి పంపించండి ఫ్రెండ్స్ అంటూ నెత్తిమీద బిగ్ బాస్ సీజన్ 8 అని రాసుకొని పరిగెత్తుతూ వీడియో తీసి షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.. విన్నర్ నువ్వే బ్రో.. నువ్వు తప్పకుండా.. బిగ్ బాస్ 8 స్వాగతం చెప్తుంది కన్ఫామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here