Bigg Boss : బిగ్ బాస్ షో‌ను ఆపేయండి.. మహిళ ఎమ్మెల్యే ఫిర్యాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

0
28
బిగ్ బాస్ షో‌ను ఆపేయండి.. మహిళ ఎమ్మెల్యే ఫిర్యాదు..

బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోను ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారో అందరికి తెలుసు అలాగే బిగ్ బాస్ షో పై ఇప్పటికే చాలా విమర్శలు కూడా వచ్చాయి. బిగ్ బాస్ పై ఇప్పటికే చాలా మంది కేసులు కూడా పెట్టారు. బిగ్ బాస్ వల్ల సమాజానికి ఏం ఉపయోగం.? అసలు ఈ గేమ్ షో వల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు.? అంటూ ఇప్పటికే చాలా మంది వెతిరేకిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ షో పైన కూడా ఇప్పటికే చాలా మంది విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అలాగే పోలీస్ కేసులు కూడా పెట్టారు. అయినా కూడా బిగ్ బాస్ షో ప్రేక్షాదరణతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ షో పై ఓ మహిళ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఈ షోను వెంటనే ఆపేయాలి. ఈ షో నిర్మాతలపైనా, ప్రసార సంస్థ సీఈవోపైనా సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే..

శివసేన కార్యదర్శి.. అధికార ప్రతినిధి ఎమ్మెల్యే డా. మనీషా కయాండే ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్‌ను సంప్రదించారు. జూలై 18న ప్రసారమైన ‘ హిందీ బిగ్ బాస్ ఓటీటీ 3’ ఎపిసోడ్‌లో నటుడు కెమెరా ముందు చాలా అసహ్యకరమైన పనులు చేశాడని ఆమె పోలీసు కమిషనర్‌కు తెలిపారు. అదే ఎపిసోడ్ లో కయాండే యూట్యూబర్‌లు అర్మాన్ మాలిక్ , కృతిక మాలిక్ కుటుంబ సంబంధాల యొక్క అన్ని హద్దులను దాటి సామాజిక విలువలను తుంగలో తొక్కారని ఆమె విమర్శించారు.

ఇది కూడా చదవండి : 13మందితో ఎఫైర్స్.. ఇప్పటికీ సింగిల్‌గానే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..!

“బిగ్ బాస్ ఓటీటీ 3 షో అన్ని పరిమితులను దాటింది. పిల్లలు కూడా ఈ షో చూస్తారు. యూట్యూబర్ అర్మాన్ మాలిక్ చేసేది ప్రజల మనస్సులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ షోను వెంటనే ఆపేయాలి. ఈ షో నిర్మాతలపైన, ప్రసార సంస్థ సీఈవోపైన సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ వీడియో కూడా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిందో లేదో చూడాలి. ఈ నేరం కిందకు వచ్చే అన్ని ఐపీసీ సెక్షన్‌లను సదరు షోలో పాల్గొన్న వ్యక్తులపైన, షో సీఈవోపైన విధించాలి’’ అని పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా డిమాండ్ చేశారు ఆమె.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

అదే సమయంలో, ఓటీటీని కూడా సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలని కూడా డిమాండ్ చేయడానికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిని కలుస్తానని కయాండే తెలిపారు. బిగ్ బాస్ ఓటీటీ’ మూడవ సీజన్‌లో, యూట్యూబర్ అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలతో పాటు కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. దీనిపై కొందరు సెలబ్రిటీలు కూడా విమర్శలు గుప్పించారు. అర్మాన్ మొదటి భార్య పాయల్ మాలిక్ కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమేట్ అయ్యి వెళ్లిపోయారు. ఆ తర్వాత, అర్మాన్, కృతికల రొమాన్స్ షోలో కనిపించింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై చాలా విమర్శలు వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here