Bharateeyudu Movie: కమల్ హాసన్ భారతీయుడు సినిమా ఆ తెలుగు హీరోలు చేయాల్సింది.. కానీ…

0
20
భారతీయుడు సినిమాలో తెలుగు హీరోలు.. ఎందుకు సెట్ కాలేదంటే..

డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వైవిధ్యమైన కథలను, జనాలను ఆలోచించేలా చేసే చిత్రాలను రూపొందించడంలో ముందుంటారు. సమాజాన్ని మేల్కొలిపే సినిమాలు తెరకెక్కించడంలో ఆయనకు సాటిలేరు. ఒకేఒక్కడు, రోబో, అపరిచితుడు, భారతీయుడు వంటి చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేశారు. యూత్, ప్రజలను ఆకట్టుకునే సందేశాత్మక చిత్రాలను తెరకెక్కిస్తుంటారు. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు 2 మూవీని తెరకెక్కించారు.

గతంలో సూపర్ హిట్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వె్ల్ గా ఇప్పుడు భారతీయుడు 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. జూలై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు భారతీయుడు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. భారతీయుడు సినిమా కథ ఎలా మొదలైంది..? ముందుగా ఈ సినిమాకు ఏఏ హీరోలను అనుకున్నారు ? అనే విషయాలను తెలుసుకోండి.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పెరియ మనుషన్ సినిమా తెరకెక్కించాలనుకున్నారు. కానీ అప్పుడు రజినీ మరో ప్రాజెక్టులో బిజీగా ఉండడంతో ఈ సినిమా ఆలస్యమయ్యింది. దీంతో అదే కథలో కొన్ని మార్పులు చేసి ఇండియన్ (భారతీయుడు)గా మార్చారని సమాచారం. ఇందులో సేనాపతిగా రాజశేఖర్, ఆయన కుమారుడి పాత్రలో హీరో వెంకటేశ్ లేదా నాగార్జునను తీసుకోవాలనుకున్నారట. ఆ కాంబో వర్కౌట్ కాలేదు. ఇక ఆ తర్వాత అదే పాత్రలకు తమిళ నటులు కార్తిక్, సత్యరాజ్ లను ఎంపిక చేయాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. దీంతో చివరకు కమల్ హాసన్ ను సంప్రదించగా.. స్క్రిప్టు నచ్చడంతో ఆయనే ద్విపాత్రాభినయం చేసేందుకు ఒకే చెప్పారు. 1996 మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here