Bharateeyudu 2: భారతీయుడు 2 టికెట్ రేట్లు పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఎంతంటే

0
37
భారతీయుడు 2 మూవీ టీమ్‌కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వేల్. భారతీయుడు 2 మూవీ జులై 12 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకులు ఎంతో మెచ్చిన సేనాపతి పాత్రతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు కమల్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఈ మూవీలో కరుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, బాబీ సింహా కీ రోల్స్‌ పోషించారు. తాజాగా భారతీయుడు 2 మూవీ నిర్మాతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

జులై 12 నుంచి 19 తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50.. మల్టీఫ్లెక్స్‌లో రూ.75 వరకూ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలానే వారం రోజులపాటు ఐదో ఆట ప్రదర్శనకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే  సినిమా స్టార్టయ్యే ముందు.. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై యాడ్స్ ప్రదర్శించేలా కండీషన్ పెట్టింది. ఇటీవల విడుదలైన ప్రభాస్ చిత్రం కల్కి 2898 ఏడీ సినిమాకు కూడా రేట్లు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సినిమా తారలు.. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైతే.. తాము మరింత తోడ్పాడు అందిస్తామని.. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here