వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది హీరోయిన్ అంజలి. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో వేశ్వ పాత్రలో మెప్పించిన అంజలి.. ఇప్పుడు మరోసారి వేశ్వ పాత్రతో అడియన్స్ ముందుకు వచ్చింది..ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ బహిష్కరణ. ఫస్ట్ లుక్ నుంచి ఈ సిరీస్ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఆ తర్వాత విడుదలైన టీజర్, ట్రైలర్ సిరీస్ పై హైప్ పెంచేశాయి. ఇందులో అంజలి వేశ్య పాత్రలో నటించింది. ముకేష్ ప్రజాపతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ సెన్సేషన్ సృష్టిస్తోంది. మొదటి రోజు నుంచే రికార్డ్ స్థాయిలో వ్యూ్స్ వచ్చాయి.
తొలి మూడు రోజుల్లోనే ఈ సిరీస్ 3.5 కోట్ల వ్యూయింగ్ నిమిషాలు దాటేసింది. ఈ సిరీస్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సాధించిందని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వెల్లడించింది. ఫస్ట్ డే నుంచి బహిష్కరణ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇందులో మరోసారి వేశ్య పాత్రలో అంజలి నటనతో అదరగొట్టింది. ఇక ఈ సిరీస్ లో అంజలితోపాటు రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, అనన్య నాగళ్ల, షణ్ముఖ్, మహబాబ్ పాషా, చైతన్య సగియోజు కీలకపాత్రలు పోషించారు. ఇంటెన్స్ డ్రామాను మరింత ఆసక్తికరంగా రూపొందించారు డైరెక్టర్ ముఖేష్ ప్రజాపతి. బహిష్కరణ కంటెంట్ సూపర్ అంటూ పాజిటివ్ రివ్యూస్ రావడంతో రోజు రోజుకు ఈ సిరీస్ కు వ్యూస్ ఎక్కువగానే వస్తున్నాయి.
కథ విషయానికి వస్తే..
గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి గ్రామంలో పెద్దగా ఉండే శివయ్య (రవీంద్ర విజయ్) తన అధికారంతో మహిళ జీవితాలను నాశనం చేస్తుంటాడు. అలాగే ఇటు పుష్ప (అంజలి) వేశ్యతోనూ సంబంధం కొనసాగిస్తుంటాడు. దర్శి (శ్రీ తేజ) అనే కుర్రాడు పుష్పను ప్రేమిస్తూ తన ప్రేమ విషయాన్ని చెప్పడంతో పుష్ప కూడా అంగీకరిస్తుంది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ లక్ష్మి (అనన్య నాగళ్ల)తో దర్శి పెళ్లి అయ్యేలా శివయ్య ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? పుష్ప, దర్శి పెళ్లి చేసుకున్నారా..? లక్ష్మి అనే అమ్మాయి ఎవరు? దర్శి జైలుకు ఎందుకు వెళ్లాడు..? పుష్ప శివయ్యపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనేది ఈ వెబ్ సిరీస్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.