Anchor Rashmi Gautam: రేప్ చేసి చంపేస్తే ఇంకా మైనర్లు అంటారేంటి? వాళ్లను వదలొద్దంటోన్న యాంకర్ రష్మీ

0
22
రేప్ చేసి చంపేస్తే ఇంకా మైనర్లు అంటారేంటి? వాళ్లను వదలొద్దు:రష్మీ

ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా హత్యాచారం చేశారు.అనంతరం శవం కూడా దొరకకుండా ఎత్తి పోతల కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా బాలిక మృత దేహం కనిపించలేదు. దీంతో మృతురాలి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇప్పుడు ఈ అంశం మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. వివరాల్లోకి వెళితే.. ముచ్చుమర్రి గ్రామానికి చెందిన సుజాత, మద్దిలేటి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కూలీ పనులతోనే కడుపు నింపుకొంటున్నారు. రెండవ కుమార్తె వాసంతి 5వ తరగతి చదువుతోంది. అయితే ఆదివారం (జూలై 07) సెలవు కావడంతో ఉదయం ఆడుకుంటానని ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్క్ లోకి వెళ్లింది. అయితే మధ్యాహ్నం దాటినా ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానమొచ్చిన ముగ్గురు మైనర్ బాలురను తమదైన స్టైల్ లో విచారించారు పోలీసులు. అప్పుడు కానీ సంచలన నిజాలు వెలుగులోకి రాలేదు. వాసంతి పై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు మైనర్లు అంగీకరించారు.

ఏపీ సీఎంవోను ట్యాగ్ చేస్తూ ..

ఇప్పుడీ హత్యాచార ఘటన అందరినీ కలచివేస్తోంది. ఈ దారుణానికి కారణమైన ముగ్గురు 15 ఏళ్లలోపు వారే కావడం విచారించదగ్గ విషయం. . తాజాగా ఈ దారుణ ఘటనపై స్టార్ యాంకర్ రష్మీ స్పందించింది. ‘ వాళ్లు పెద్ద వాళ్లలా హత్యా చారం చేయగలిగితే.. శిక్ష కూడా పెద్ద వాళ్ల లాగే ఉండాలి. వాళ్లు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు. కాబట్టి వాళ్లు కచ్చితంగా మైనర్లు అయితే కాదు. మైనర్లు అనే నెపంతో వాళ్లు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదు’ అని ట్వీట్ చేసింది రష్మి. ఈ పోస్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎంవోను ట్యాగ్ చేసింది.

ఇవి కూడా చదవండి

యాంకర్ రష్మీ గౌతమ్ ట్వీట్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here