Anasuya : పవన్ కళ్యాణ్ సినిమా వదులుకున్నా.. ఫ్యాన్స్ ఫుల్లుగా ట్రోల్ చేశారు.. అనసూయ కామెంట్స్

0
46
పవన్ కళ్యాణ్ సినిమా వదులుకున్నా.. ఫ్యాన్స్ ఫుల్లుగా ట్రోల్ చేశారు

అందాల భామ అనసూయ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉంటాడా.? సమస్యే లేదు.. తన మాటలతో.. అందంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ అమ్మడు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతుంది జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది. అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది అనసూయ. యాంకర్ గా పలు టీవీ షోల్లో కనిపించి మెప్పించిన అనసూయ.. ఆతర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో రంగమ్మత్తగా అద్భుతంగా నటించి మెప్పించింది అనసూయ.

ఇది కూడా చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రలో కనిపించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టీవీ షోల్లోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటుంది అనసూయ. ఇదిలా ఉంటే అనసూయ చేసిన ఓల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వస్తే అనసూయ వదులుకుంది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది అనసూయ.

ఇది కూడా చదవండి : Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తరింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు కూడా భారీ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. “ఇట్స్ టైం టూ పార్టీ నౌ” అనే సాంగ్ కోసం ముందుగా అనసూయను సంప్రదించారట. అయితే అందులో చాలా మంది హీరోయిన్స్ కూడా కనిపిస్తారు అని చెప్తే దానికి అనసూయ నో చెప్పారట. నేను ఒక్కదాన్నే చేస్తాను.. అంతమందితో కలిసి అంటే నేను చేయను అని చెప్పిందట. ఆ పాటలో సమంత, ప్రణీత కూడా ఉంటారు. అయితే అనసూయ మాత్రం నేను సోలోగా ఉంటేనే చేస్తా అని చెప్పిందట. ఆ తర్వాత మరొకరిని తీసుకున్నారట. అయితే ఆ సమయంలో నెటిజన్స్ అనసూయను భారీగా ట్రోల్ చేశారట.. అయితే సినిమా యూనిట్, నేను అంతా ఒకే అనుకున్నాం కానీ కొంతంది మాత్రం నన్ను పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ వస్తే నో చెప్తావా అంటూ ట్రోల్ చేశారు. నువ్వు పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవు అంటూ కామెంట్స్ చేశారు. కానీ నేను అంత దూరం ఆలోచించలేదు అని తెలిపింది అనసూయ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here