Ananya Panday: లగ్జరీ కారు కొన్న లైగర్ బ్యూటీ.. నెంబర్ ప్లేట్ స్పెషాల్టీ ఏంటంటే..

0
22
Ananya Panday

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ అనన్య పాండే. ఈ అమ్మడి పెను ఈ మధ్య తెగ వినిపిస్తుంది. సినిమాల్లో అంతగా సక్సెస్ సాధించకపోయినా సోషల్ మీడియా ద్వారా లేదా.. వ్యక్తిగత విషయాలతో ఈ అమ్మడు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్ పాండ్యాను ఫాలో అవ్వడంతో వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది ఓ లగ్జరీ రేంజ్ రోవర్‌ని కొనుగోలు చేసింది . దీని ధర దాదాపు 3 కోట్లలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె కొనుగోలు చేసిన కారుపై జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం కారు నంబర్ ప్లేట్.

అనన్య పాండే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది . కానీ ఏమీ సినిమా హిట్ అవ్వలేదు. కానీ గ్లామరస్ బ్యూటీగా అనన్యకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ తన లగ్జరీ కారుతో సందడి చేస్తుంది. ఆమె కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారు ధర అక్షరాలా రూ.3.38 కోట్లు. అనన్య పాండేకి చాలా కార్లు ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు మరో కొత్త కారు చేరింది. ఆమె కొత్త కారు నంబర్ 3000. ఈ నెంబర్ ను ఆమె ప్రత్యేకంగా కొనుగోలు చేసినట్లు సమాచారం. అనన్య పుట్టినరోజు అక్టోబర్ 30. అందుకే ఆమె 3000 కొనుగోలు చేసి ఉండవచ్చని కొందరు ఊహిస్తున్నారు.

మరీ ముఖ్యంగా హాలీవుడ్ మార్వెల్ సినిమాలోని బోరో లైన్ కోసం ఈ నంబర్ ప్లేట్ ను ఆమె తీసుకొని ఉంటుందని కూడా టాక్ వినిపిస్తుంది. మార్వెల్ సినిమాలో ‘ఐ లవ్ యూ 3000 టైమ్స్’ అనే డైలాగ్ వస్తుంది. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ లో ఐరెన్ మ్యాన్ ఈ డైలాగ్ వాడుతారు. అందువల్ల అనన్య ఒక మార్వెల్ లవర్ గా ఈ నెంబర్ తీసుకొని ఉంటుందని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల, అనన్య పాండే అంబానీ ఇంటి వివాహ కార్యక్రమంలో పాల్గొంది. ఈ వివాహ వేడుకలో ఆమె హార్దిక్ పాండ్యాతో కలిసి కనిపించింది. ఆ తర్వాత ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. దాంతో ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Ananya Panday

అనన్య పాండే ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here