రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడకకు విదేశీ నటీనటులు, సెలబ్రెటీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అలాగే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా స్టార్స్ అందరూ అంబానీ వివాహ వేడుకలలో సందడి చేశారు. గత వారం పది రోజులుగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న జరిగిన శుభ్ ఆశీర్వాద్ వేడుకలో పీఎం నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంత్, రాధికల పెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. అలాగే ఈ పెళ్లికి వచ్చిన అతిథులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఆతిథ్యాన్ని అందిస్తున్నారు అంబానీ కుటుంబం.
ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అంబానీ వివాహ వేడుక అబ్బురపరిచింది. వేదికను అద్భుతమైన పూల అలంకరణలు, మెరిసే లైట్లతో అలంకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రెటీల కోసం అంబానీ కుటుంబం ప్రత్యేకంగా దుస్తులు సిద్ధం చేయించింది. అలాగే ముకేశ్ అంబానీ కుటుంబసభ్యులు ధరించిన దుస్తులు, ఆభరణాలనూ చూసి ఆశ్యర్యపోతున్నారు నెటిజన్స్. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం కోసం ముకేశ్ అంబానీ దాదాపు రూ.5000 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. అనంత్ అంబానీ తన పెళ్లిలో ధరించిన వాచ్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. తన పెళ్లి వేడుకలో అనంత్ అంబానీ రిచర్డ్ మిల్లే RM 52-05 టూర్ బిల్లాన్ ఫారెల్ విలియమ్స్ వాచ్ ధరించాడు. ఇది చాలా విలాసవంతమైన టైమ్ పీస్. పెళ్లి వేడుకలలో అనంత్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అద్భుతమైన వాచ్ ధర సుమారు రూ.54 కోట్లు. ప్రపంచంలోని అత్యుత్తమ, అత్యంత ప్రత్యేకమైన వస్తువులపై అంబానీ కుటుంబం ఆసక్తి చూపిస్తుందని మరోసారి నిరూపించబడింది. అలాగే అంబానీ పెళ్లి వేడుకలో ప్రపంచ స్థాయి చెఫ్‌లు తయారుచేసిన వంటకాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల రుచికరమైన వంటకాలతో అతిథులకు విందును అందించారు.
#WATCH | Ambani family at the Jio World Convention Centre in Mumbai, for Anant Ambani and Radhika Merchant’s wedding, in Mumbai pic.twitter.com/roErj3aiVd
— ANI (@ANI) July 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.