Anant Ambani Wedding: ఆ ఓటీటీలో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకలు.. జియో సినిమాలో మాత్రం కాదండోయ్

0
26
ఆ ప్రముఖ ఓటీటీలో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకలు

రిలయన్స్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు ముహూర్తం దగ్గరపడుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు అనంత్ అంబానీ. జులై 12న ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‏లో ఈ వివాహం జరగనుంది. ఇందుకోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ ల గ్రాండ్ వెడ్డింగ్ కు సంబంధించి ఏ చిన్న విషయమైన నెట్టింట తెగ వైరలవుతోంది. ఇప్పుడు వీరి పెళ్లి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలనే ఓ రేంజ్ లో చేసిన ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి వేడుకను ఇంకెంత గ్రాండ్ గా చేస్తారోనని చాలా మంది ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మరోవైపు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకకు దేశ, విదేశాల నుంచి అతిరథ మహారథులు వస్తున్నారు. అయితే అందరూ ఈ వివాహ వేడుకల్లో పాల్గొన లేరు. అందుకే ప్రముఖ ఓటీటీ సంస్థకు అనంత్ అంబానీ- రాధికల వివాహ వేడుక ప్రసార హక్కులను అప్పగించారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా అంబానీ ఇంట్లో వివాహం అంటే వారి సొంత ఓటీటీ సంస్థ జియో సినిమాలో వచ్చే అవకాశం ఉంటుందనుకుంటారు. అయితే అనూహ్యంగా అనంత్ అంబానీ పెళ్లి ప్రసార హక్కులను మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకోవడం గమనార్హం. అంటే జులై 12న అంబానీ కుమారుడి వివాహాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్ ఫామ్ లో అందరూ చూడచ్చన్న మాట.. ఇక పెళ్లి వేడుకల విషయానికి వస్తే.. జులై 12న ‘శుభ్ వివాహ్ తో’ అసలైన పెళ్లి సంబరాలు మొదలు కానున్నాయి. జులై 13న శుభ ఆశీర్వాదం వేడుకలు నిర్వహిస్తారు. జూలై 14న మంగళ్ ఉత్సవ్ (రిసెప్షన్) నిర్వహించనున్నారు.

సల్మాన్ ఖాన్ డ్యాన్స్..

కాగా అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఇప్పటికే రెండు సార్లు ఘనంగా నిర్వహించారు. మొదట జామ్ నగర్ లో, ఆ తర్వాత ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు క్రూయిజ్ షిప్ లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. ఆ తర్వాత వారి వివాహ వేడుకల్లో భాగంగా 50 నిరుపేద జంటలకు ఘనంగా సామూహిక వివాహాలు కూడా చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here