డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విజయవంతంగా దూసుకుపోతుంది. 14వ రోజు ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్లు రాబట్టింది. దీంతో ఇప్పటివరకు ఇండియాలో రూ.536.75 కోట్లు రాబట్టింది. వారం రోజులు కావడంతో సినిమా వసూళ్లు బాగా తగ్గాయి. వీకెండ్‌కి సినిమా కలెక్షన్లు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ‘కల్కి 2898 AD’ తెలుగు సినిమా. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. బాహుబలి సినిమాతో నార్త్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ ఫాలోయింగ్ పెంచుకున్న ప్రభాస్.. ఇప్పుడు కల్కి మూవీతో మరోసారి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం కల్కి చిత్రానికి నార్త్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.
అలాగే ఈ సినిమాలో అమితాబ్ నటించడం మరో కారణం అని కూడా చెప్పొచ్చు. ఇందులో అమితాబ్ అశ్వద్ధామ పాత్రలో నటించి మెప్పించారు. కేవలం సినిమా చివర్లో మాత్రమే ప్రభాస్ పాత్ర హైలెట్ కాగా.. సినిమా మొత్తం అమితాబ్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. అందుకే ఈ సినిమా హిందీలో రికార్డ్స్ సృష్టిస్తుంది. రూ.500+ కోట్లలో హిందీ రూ.229.05 కోట్లు, తెలుగులో రూ.252 కోట్లు రాబట్టింది. దీంతో హిందీలో సినిమాకు మరింత డిమాండ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా 11వ రోజు బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లు రాబట్టినట్లు ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ చిత్రాన్ని అధిగమించింది. ఈ చిత్రం 915 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరే దిశగా దూసుకుపోతోంది.
అమితాబ్ బచ్చన్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. అయితే ఆయన సినిమాలేవీ ఇంత భారీ వసూళ్లను రాబట్టలేకపోయాయి. భారీ విజయం సాధించడం ఇదే తొలిసారి. అమితాబ్ అశ్వత్థామగా కనిపించి మెప్పించాడు.
#WaitOfAshwatthama (Keshava Madhava) Music Video out now!
– https://t.co/3CxaPeQ4p0#Kalki2898AD #EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/TSJya4gP0C
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.