పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయగా.. మొదటిరోజే రూ.195.5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. కాశీ, శంబలా, కంప్లెక్స్ అంటూ మూడు ప్రపంచాలను సృష్టించి.. అద్భుతమైన విజువల్ వండర్ అందించారు నాగ్ అశ్విన్. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, దిశా పటానీ కీలకపాత్రలు పోషించారు. అలాగే రాజమౌళి, ఆర్జీవీ, అనుదీప్, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా వంటి తారలు గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కల్కి సినిమా నార్త్ ఇండస్ట్రీలోనూ దూసుకుపోతుంది. ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన అశ్వత్థామ పాత్రలో అమితాబ్ నటించాడు. ఇందులో ఆయన నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. కల్కి సినిమా రూ.1000 కోట్లు రాబట్టడంపై అమితాబ్ స్పందిస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఒక్క సినిమాకు రూ. 1000 కోట్లు రావడం ప్రభాస్‌కు చాలా కామన్.. కానీ నాకు మాత్రం చాలా అరుదు అని అన్నారు.
“ఈ మధ్య విడుదలైన కల్కి 2898 ఏడి సినిమా చేయడంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈసినిమా సక్సెస్ మాములు విషయం కాదు. ప్రభాస్ కు ఇది రొటినే కావచ్చు.. ఎందుకంటే అతడి సినిమాలు రూ.1000 కోట్లు మార్క్ అందుకున్నాయి. కానీ నాకు మాత్రం ఈ కల్కి అనే ఆ భారీ ప్రాజెక్టులో భాగమైనందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాను ఇప్పటికే నాలుగుసార్లు చూశాను. ప్రతిసారీ ఏదో ఓ కొత్త విషయం ఈ సినిమాలో నేను కనుగొన్నాను” అని అన్నారు అమితాబ్.
Words of joy from the Legendary @SrBachchan sir about the gigantic success of #Kalki2898AD ❤️
https://t.co/GTLIf2ockc#EpicBlockbusterKalki @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal… pic.twitter.com/q01DvfayXq— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.