రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం (జూలై 12)న రాత్రి 8 గంటలకు ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఏడడుగులు వేయనున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు, హాలీవుడ్ సెలబ్రెటీస్, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ముంబై చేరుకున్నారు. మరోవైపు వధువు, వరుడు ఊరేగింపు వేడుక స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు అంబానీ ఇంట్లోకి చిన్న కోడలిగా అడుగుపెట్టనున్న రాధిక మర్చంట్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఆమె సోదరి అంజలి మర్చంట్ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు.
రాధిక మర్చంట్ అక్క అంజలి మర్చంట్ తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యంలో కీలకపాత్రలు పోషిస్తుంది. తండ్రి విరేన్ మర్చంట్ ఫార్మా పరిశ్రమలో ప్రపంచ కాంట్రాక్ట్ అయినా ఎన్‌కోర్ హెల్త్‌కేర్ (EHPL) వ్యవస్థాపకుడు, CEO. ఇక EHPL కంపెనీలో అంజలి, రాధిక ఇద్దరు డైరెక్టర్ల బోర్డులో పదవులను కలిగి ఉన్నారు. తమ తండ్రి వ్యాపారంలో ఈ ఇద్దరు సోదరిమణులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక రాధిక అక్క అంజలి EHPL కంపెనీలో మొదట్లో జనరల్ మేనేజర్ – బిజినెస్ డెవలప్‌మెంట్‌గా చేరి, తర్వాత మేనేజర్ – మార్కెటింగ్, క్లయింట్ ఔట్రీచ్ ఎగ్జిక్యూటివ్‌గా రాణించారు. 2021లో, EHPL అభివృద్ది, విస్తరణ స్ట్రీరింగ్ చేయడంలో ఆమె ఆలోచనలతో సుస్థిరం చేయగా.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా మారారు. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగంలోకి అడుగుపెట్టింది. మైలూన్ మెటల్స్ స్థాపించి అలియా భట్, టబు వంటి ప్రముఖులచే ప్రోత్సహించబడిన హెయిర్ స్టైలింగ్, ట్రీట్మెంట్ క్లబ్ సీఓఓగా గుర్తింపు పొందింది.
అంజలి మర్చంట్ చదువు..
ముంబైలోని ది కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత విదేశాలలో ఉన్న విద్యను అభ్యసించింది. అంజలి మసాచుసెట్స్‌లోని బాబ్సన్ కాలేజీ నుండి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పట్టా పొందింది. అలాగే లండన్ బిజినెస్ స్కూల్ నుండి MBA సంపాదించింది. విద్యావిషయక కార్యక్రమాలలో ట్రాన్స్‌ఫార్మేటివ్ సెమిస్టర్ ఎట్ సీ ప్రోగ్రామ్ పూర్తి చేసింది. 12 దేశాలలో విభిన్న సంస్కృతుల గురించి అధ్యానయం చేసింది. ఈ అనుభవం గ్లోబల్ ఎకనామిక్స్, లాంగ్వేజెస్, ఇంటర్నేషనల్ స్టడీస్‌పై ఆమె అవగాహనను సుసంపన్నం చేసింది.
అంజలి వ్యక్తిగత జీవితం..
2020లో ప్రముఖ వ్యాపారవేత్త అమన్ మజిథియాను వివాహం చేసుకుంది అంజలి. వీరికి ఒక బాబు ఉన్నాడు. అమన్ మజిథియా EHPL కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే కంపెనీలోని CMO యూనిట్ కార్యాచరణ అంశాలను చూసుకుంటారు. అంజలి నికర విలువ సుమారు రూ.2000 కోట్లకు పైగానే ఉంటుంది. ఫార్మా రంగంలో అగ్రగామీగా కొనసాగుతుంది విరేన్ మర్చంట్ ఫ్యామిలీ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.