Wednesday, December 25, 2024
Google search engine
HomeUncategorizedAman Preet Singh: రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.. ఆమె మన టాలీవుడ్ క్రీజీ...

Aman Preet Singh: రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.. ఆమె మన టాలీవుడ్ క్రీజీ హీరోయినే..

మహానగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపబడింది. టచ్‌ చేస్తే డ్రగ్‌ లింక్‌లు డొంకలు కదులుతున్నాయి. ఎక్కడ సరుకు పట్టుబడిన మూలం గోవాదారినే. లేటెస్ట్‌గా నార్కోటిక్స్‌ బ్యూరో, రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌లో పట్టుబడిన సరుకు కూడా గోవా నుంచే సప్లయ్‌ చేయబడింది. ఇది అట్టాంటి ఇట్టాంటి సరకు కాదు.. జస్ట్ ఇన్‌హేల్‌ చేస్తే నరాలు జివ్వుమనేలా మత్తు స్వర్గాన్ని చూపే ప్యూర్లీ కొకైన్‌.. పట్టుబడింది గ్రామో పది గ్రాములో కాదు. ఆల్‌ టైమ్‌ హై రికార్డు ..2 కోట్ల విలువ చేసే 200 గ్రాముల కొకైన్‌ సీజ్‌ చేశారు పోలీసులు. ఒకవైపు ఉక్కుపాదం..మరోవైపు మత్తుపాదు. టచ్‌ చేస్తే డ్రగ్‌ లింకుల డొంకలు కదులుతున్నాయి. ఎంత నిఘా పెట్టినా సరే డ్రగ్‌ మాఫియా బరితెగిస్తుందంటే అర్ధం ఏంటీ? డిమాండ్‌ అండ్‌ సప్లయ్‌ సూత్రమే కారణమా?…కస్టమర్ల నుంచి డిమాండ్‌ ఉంది కాబట్టే నైజీరియన్‌ గ్యాంగ్‌ నకరాలు సాగుతున్నాయా?…బ్రదరాఫ్‌ భ్రమరాంబ సహా పట్టుబడిన ఐదుగురి కాల్‌డేటా పై ఫోకస్‌ పెట్టారు పోలీసులు.

అయితే ఇక డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే అరెస్టైన హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ప్రీత్‌ సింగ్‌ని A14గా చేర్చారు పోలీసులు. మరోసారి నిందితుల శాంపిల్స్‌ తీసుకున్నామన్నారు. అమన్‌ప్రీత్‌తో పాటు పాజిటివ్‌ వచ్చినవారికి నోటీసులిచ్చామని తెలిపారు. అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు.. DPS 27 ప్రకారం కన్జుమర్లు కూడా నిందితులేని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు రకుల్ తమ్ముడు అరెస్ట్ అవ్వడంతో అతని గర్ల్ ఫ్రెండ్ టెన్షన్ లో పడిందని తెలుస్తోంది.

అతని గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు మన టాలీవుడ్ హీరోయినే.. ఆమె సీరత్ కపూర్. శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రాజా రన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సీరత్ కపూర్. ఆతర్వాత ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెప్పించింది. నటనతో పాటు అందంతోనూ కవ్విస్తుంది ఈ వయ్యారి భామ. అయితే అమన్‌ప్రీత్‌ సింగ్‌, సీరత్ కపూర్ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రకుల్, జాకీ, సీరత్, అమన్ కలిసి ఇటీవల విహారయాత్రకు కూడా వెళ్లారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు అమన్, సీరత్ కలిసి నటించిన ఆవోనా మ్యూజిక్ అల్బమ్‌లో వారిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అయితే అమాన్ తో పాటు సీరత్ కు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందా లేదా అన్నది తెలియదు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సీరత్ కపూర్ తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments