Ajith Kumar: ఆసుపత్రిలో భార్య షాలిని.. షూటింగ్ నుంచి హడావిడిగా అజిత్.. అసలేం జరిగిందంటే..

0
37
ఆసుపత్రిలో అజిత్ భార్య షాలిని..

కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. దక్షిణాదిలో ఈ హీరోకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనూ అజిత్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరో అయినా సింపుల్ లైఫ్ గడిపేస్తుంటారు అజిత్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో తునీవు సినిమాతో హిట్ అందుకున్న అజిత్.. ప్రస్తుతం విదా ముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం విడతలి చివరి షూటింగ్ కోసం అజర్ బైజాన్ వెళ్లారు. అయితే నిన్న హడావిడిగా అజర్‌బైజాన్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు అజిత్. చెన్నై ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

అజిత్ ఆసుపత్రికి వెళ్లడానికి కారణం అతడి భార్య హీరోయిన్ షాలిని. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో షాలినికి చిన్నపాటి సర్జరీ జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని.. తన భార్యను చూసేందుకే అజిత్ అజర్ బైజాన్ నుంచి చెన్నై వచ్చారని, షాలిని కోలుకున్న తర్వాత నటుడు అజిత్ మరోసారి అజర్ బైజాన్ లో డిలిజెన్స్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఆసుపత్రి బెడ్ పై ఉన్న షాలిని చేతులు పట్టుకుని ఉన్న అజిత్ ఫోటోస్ వైరలవుతుండగా.. షాలిని త్వరగా కోలుకోవాలని.. బ్యూటీఫుల్ కపూల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

గత కొంత కాలంగా షాలిని కొన్ని శారీరక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అజిత్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో షాలిని సర్జరీ సమయంలో ఆమెతోపాటు ఉండలేకపోయాడు. కొత్త సినిమా కోసం అజర్ బైజాన్ వెళ్లాల్సి రావడంతో తన భార్య సర్జరీకి అవసరమైన పనులు కంప్లీట్ చేసి.. అందుకు సంబంధించిన వైద్యులతో మాట్లాడి విదేశాలకు వెళ్లారట. షూటింగ్ వాయిదా వేస్తే నిర్మాతకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని.. అందుకే తన భార్యకు సర్జరీ చేయాల్సి వచ్చినా షూటింగ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం తన షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని భార్యను చూసేందుకు హడావిడిగా చెన్నై చేరుకున్నాడు అజిత్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here