Adivi Sesh: నచ్చకపోయినా హీరోయిన్‌తో అలాంటి సీన్ చేశా.. ఆ తర్వాత మనసు మార్చుకున్న శేష్

0
22
నచ్చకపోయినా హీరోయిన్‌తో అలాంటి సీన్ చేశా..

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అడవి శేష్. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోగా మారి వరుస హిట్స్ అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. రొటీన్ కథలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అడవి శేష్ కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమాలో అమెరికా పెళ్లికొడుకుగా చిన్న రోల్ లో కనిపించాడు. ఆతర్వాత కర్మ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకత్వం తో పాటు రచయితగా కూడా చేశాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించాడు. అలాగే బలుపు సినిమాలోకూడా నెగిటివ్ రోల్ లో చేశాడు.

ఇదికూడా చదవండి : అనుపమ, బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా.? ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే

ఆ తర్వాత మెల్లగా సెకండ్ హీరోగా చేశాడు. రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, బాహుబలి, దొంగాట, సైజ్ జీరో, ఊపిరి సినిమాలో గెస్ట్ రోల్స్ చేశాడు. ఆతర్వాత క్షణం, అమీ తుమీ, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఒక సినిమా వల్ల అడవి శేష్ కసి పెంచుకొని వరుసగా హిట్స్ అందుకున్నాడట. ఆ సినిమా ఎదో కాదు బలుపు. ఈ సినిమాలో నటించడం అడవి శేష్ కు ఇష్టం లేదట.. బలుపుసినిమాలో నచ్చని రోల్ చేశాను అని తెలిపాడు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ ను జుట్టు పట్టుకొని లాక్కెళ్ళే సీన్ చేసేటప్పుడు నాకే నామీద అసహ్యం వేసింది. ఇలాంటి పాత్రలు చేస్తున్నానా .? అని అనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. కానీ నా పాత్ర ఉపయోగం లేని పాత్ర అని అడివిశేష్ తెలిపాడు. ఆ సినిమా వల్ల నాకు జరిగిన ఉపయోగం ఏంటంటే.. రవితేజ, గోపీచంద్ మలినేని పరిచయం అవ్వడమే అని అన్నాడు శేష్. శ్రుతిహాసన్ తో ఆ సీన్ చేయడం వల్లే నాలో కసి పెరిగింది. ఆ తర్వాత వరుసగా 5 హిట్స్ అందుకున్నాను అని అన్నాడు. బలుపు చిత్రం తర్వాత నేను మారాలి అని ఆలోచించడం మొదలు పెట్టా.. ఆ తర్వాత అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ హిట్స్ అందుకుంటున్నా అని తెలిపాడు శేష్.

శ్రుతిహాసన్  ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అడవి శేష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here