Actress Simran: సిమ్రాన్ చెల్లెలి గురించి తెలుసా..? 21 ఏళ్లకే ఆత్మహత్య.. అతడే కారణమంటూ..

0
26
సిమ్రాన్‌ చెల్లెలి సూసైడ్‌.. అతడే కారణమా..

దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా ఓ గుర్తింపు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో అలరించిన సిమ్రాన్.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కొన్నాళ్లపాటు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ పోషించినా.. ఇప్పుడు సినిమాల్లో అసలు కనిపించడం లేదు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటూ తన ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది. ఇదిలా ఉంటే.. సిమ్రాన్ చెల్లెలి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె చెల్లెలి పేరు మోనాల్. అక్కలాగే ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ 21 ఏళ్లకే తనువు చాలించిందనే విషయం ఈతరం వారికి తెలియదు.

సిమ్రాన్ సినిమాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే చెల్లెలు కూడా సినీరంగంలోకి రావాలనుకుంది. ఢిల్లీలో సిమ్రాన్ డిగ్రీ చేస్తున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇంద్రధనుష్ మూవీతో కన్నడ సినీపరిశ్రమలోకి రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీతోపాటు, పలు తమిళ్ సినిమాల్లోనూ నటించింది. ఇక తెలుగులో ఇష్టం మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లో మరిన్ని సినిమాలకు సైన్ చేసింది. దీంతో అతి తక్కువ సమయంలోనే మోనాల్ స్టార్ డమ్ సంపాదించుకుంటుందని అనుకున్నారంతా.. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సూసైడ్ చేసుకుంది మోనాల్.

చేతినిండా సినిమాలో సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే 2002 ఏప్రిల్ 14న చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది మోనాల్. అప్పటికీ ఆమె వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. మోనాల్ సూసైడ్ ఘటనతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సిమ్రాన్ తోపాటు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు మోనాల్ ఆత్మహత్య విషయం తెలిసి షాకయ్యారు. అయితే తన చెల్లెలు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఓ కొరియోగ్రాఫర్ అని సిమ్రాన్ అప్పట్లో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో తన చెల్లెలిని మోసం చేశాడని.. దీంతో ఆ బాధ తట్టుకోలేక మోనాల్ ఆత్మహత్య చేసుకుందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పటికీ సిమ్రాన్ చెల్లెలు మోనాల్ సూసైడ్ మిస్టరీగానే మిగిలిపోయింది. నటిగా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఎన్నో ఆశలతో సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అమ్మాయి.. 21 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం అప్పట్లో అందరినీ తీవ్ర దిగ్ర్బాంతికి గురిచేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here