ఒకప్పుడు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో మెప్పించిన తారలలో హీరోయిన్ సంఘవి ఒకరు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయి… తనదైన నటనతో తెలుగు అడియన్స్ హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకుంది. రెండు దశాబ్దాలుగా దక్షిణాది భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీ, తమిళం వంటి భాషలలో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించింది. శ్రీకాంత్ నటించిన తాజ్ మహల్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన సంఘవి మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారును ఫిదా చేసింది. అందం, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టింది. సినీ ప్రయాణంలో తన పేరును సంఘవిగా మార్చుకుంది.
ఇక డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం మూవీతో సంఘవికి మంచి పాపులారిటీ వచ్చింది. మాస్ మాహారాజ రవితేజ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ 1997లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సంఘవి కథానాయికగా నటించింది. ఈ మూవీ తర్వాత తెలుగులో సంఘవికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుని టాప్ హీరోయిన్ గా వెలిగిపోయింది. కర్ణాటకలోని మైసూర్ కు చెందిన సంఘవి.. సింధూరం సినిమాకు నంది అవార్డ్ అందుకుంది.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సైలెంట్ అయిన సంఘవి.. వివాహం మాత్రం ఆలస్యంగానే చేసుకుంది. 2016లో వెంకటేష్ అనే ఐటీ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప జన్మించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంఘవి ఫ్యామిలీకే తన టైమ్ కేటాయించింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ పంచుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.