Friday, December 27, 2024
Google search engine
HomeUncategorizedActress Malashri : ప్రేమఖైదీ మూవీ హీరోయిన్ మాలా శ్రీ కొడుకును చూశారా..? హీరోలకు ధీటుగా...

Actress Malashri : ప్రేమఖైదీ మూవీ హీరోయిన్ మాలా శ్రీ కొడుకును చూశారా..? హీరోలకు ధీటుగా ఉన్నాడే..

అందం, అభినయంతో తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది హీరోయిన్ మాలాశ్రీ. 1991లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ప్రేమఖైదీ సినిమాలో హారీష్ సరసన నటించింది మాలాశ్రీ. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత వెంకటేశ్ నటించిన సాహసవీరుడు సాగరకన్య, భలే మావయ్య వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో తనదైన నటనతో అడియన్స్ మనసు దోచుకున్న మాలాశ్రీ ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటున్న సమయంలోనే కన్నడలో స్థిరపడిపోయింది. లవ్, యాక్షన్ సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుగులో కొన్ని చిత్రాల్లో మెరిసింది. తెలుగు చివరగా 1997లో సూర్య పుత్రులు సినిమాలో కనిపించింది. ఇక కన్నడలో స్టార్ డమ్ సంపాదించుకున్న మాలాశ్రీ.. నిర్మాత రాముతో ముత్యనంత హెంతి సినిమా చేసింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది.

వీరికి అనన్య, అర్జున్ అని ఇద్దరు పిల్లలున్నారు. 2021లో మాలాశ్రీ భర్త రాము కరోనాతో మరణించాడు. ఇదిలా ఉంటే.. మాలాశ్రీ తన పిల్లలిద్దరిని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇప్పటికే కూతురు అనన్య.. ఇప్పటికే ఇండస్ట్రీలో కథానాయికగా అడుగుపెట్టింది. కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన కాటీర సినిమాలో నటించింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది మాలాశ్రీ కూతురు. ఇక ఇప్పుడు కొడుకు కూడా సినిమాల్లోకి తెరంగేట్రం చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. తాజాగా తన కొడుకు ఆర్యన్ వర్కవుట్ ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది మాలాశ్రీ. ఆర్యన్ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మాలాశ్రీ కొడుకు ఆర్యన్ ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్నాడు. అక్కడే సినిమాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. అంతేకాకుండా ఆర్యన్ కు వర్కవుట్, బాక్సింగ్ పై చాలా ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టేందుకు కావాల్సిన ఎత్తు, బరువు, అందం ఆర్యన్ లో ఉన్నాయని.. అతడు త్వరలోనే సినీరంగంలోకి రావడం ఖాయమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఆర్యన్.. చదువు పూర్తయ్యాక ఇండియాకు తిరిగి వచ్చి సినిమా రంగంలోకి అడుగుపెడతాడని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments