Thursday, December 26, 2024
Google search engine
HomeUncategorizedActor Suresh: సీనియర్ హీరో సురేష్ కొడుకు ఎవరో తెలుసా..? వైరలవుతున్న ఫోటోస్..

Actor Suresh: సీనియర్ హీరో సురేష్ కొడుకు ఎవరో తెలుసా..? వైరలవుతున్న ఫోటోస్..

సీనియర్ హీరో సురేష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి.. కానీ తమిళలతోనే హీరోగా కెరీర్ ప్రారంభించాడు. పన్నీర్ పుష్పాంగళ్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. నటుడిగా, విలన్ గా పలు విభిన్న పాత్రలతో మెప్పించాడు. నటుడిగా దాదాపు 270కి పైగా సినిమాల్లో నటించారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. పుట్టింటి పట్టుచీర సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ప్రార్ధన, సూరిగాడు, అల్లరి పిల్ల వంటి చిత్రాలతో నటించారు. దివంగత హీరోయిన్ సౌందర్యతో కలిసి అమ్మోరు, దొంగట, దేవీ పుత్రుడు వంటి చిత్రాల్లో కనిపించారు. హీరోగా నటించిన సురేష్.. ఆ తర్వాత విలన్ పాత్రలు, తండ్రి పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు.

చాలాకాలంపాటు అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా అలరించారు. సినిమాల్లో ఒకప్పుడు చాలా లావుగా కనిపించిన సురేష్.. ఆ తర్వాత ఉన్నట్లుండి సన్నబడ్డారు. కొన్నాళ్ల క్రితం 120 కిలోల బరువుతో ఉన్న సురేష్.. ఆ తర్వాత స్లిమ్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. సురేష్ పర్సనల్ లైఫ్ గురించి జనాలకు అంతగా తెలియదు. అలాగే అతడి కొడుకు గురించి కూడా ఎప్పుడూ ఎక్కడ మాట్లాడలేదు సురేష్. సినిమాల్లో కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే అనిత అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1990లో వీరి పెళ్లి జరగ్గా..1995లో విడిపోయారు. వీరికి ఒక బాబు ఉన్నారు.

ఆ తర్వాత సురేష్ మరో వివాహం చేసుకున్నాడు. కానీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అంతగా ఎవరితోనూ పంచుకోడు. ఇక సురేష్ మొదటి భార్యలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. అలాగే సురేష్ కొడుకు కూడా ఆమెతోపాటే అమెరికాలో తల్లివద్దే ఉంటున్నాడు. సురేష్ కొడుకు పేరు నిఖిల్ సురేష్. తాజాగా సురేష్ కొడుకు ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments