Thursday, December 26, 2024
Google search engine
HomeUncategorizedActor Abbas: ప్రేమదేశం హీరో అబ్బాస్ కూతురిని చూశారా..? ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ వైరల్..

Actor Abbas: ప్రేమదేశం హీరో అబ్బాస్ కూతురిని చూశారా..? ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ వైరల్..

ఒకప్పుడు సౌత్ ఇండియాలో లవర్ బాయ్. యూత్ ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకూమారుడు. మొదటి సినిమాతోనే హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రేమకథ చిత్రాలతో అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఆ హీరో హెయిర్ స్టైల్ అప్పట్లో చాలా ట్రెండ్. కుర్రాళ్లు ఆ హీరో హెయిర్ స్టైల్ ఫాలో అయ్యేవారంటే అప్పట్లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అతడు మరెవరో కాదు.. హీరో అబ్బాస్. ఈ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే సినిమా ప్రేమ దేశం. 1996లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే అబ్బాస్ చాలా పాపులర్ అయ్యాడు. ఇటు తెలుగులోనూ ఈ హీరోకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రేమ దేశం తర్వాత ఎన్నో పాపులర్ చిత్రాల్లో నటించి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత సినిమాలో ఎంపికలో పొరపాట్లతో స్టార్ హీరోగా ఇమేజ్ తగ్గిపోయింది. దీంతో అవకాశాలు రావడం ఆగిపోయాయి.

అనేక సినిమాల్లో సెకండ్ హీరోగా కనిపించడం.. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో హీరోగా కనిపించాడు. ఆ తర్వాత వెండితెరపై అబ్బాస్ కనిపించడం తగ్గిపోయింది. చివరగా 2009లో వచ్చిన బ్యాంక్ అనే సినిమాలో కనిపించాడు. తెలుగు, తమిళ్ భాషలలో మొత్తం 50కు పైగా చిత్రాల్లో కనిపించిన అబ్బాస్.. తర్వాత చాలా కాలం సినిమాలకు దూరమయ్యాడు. యాడ్స్ చేస్తూ మరోసారి అడియన్స్ ముందుకు వచ్చిన అబ్బాస్.. ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. అక్కడ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం ఓ మోటివేషనల్ స్పికర్ గా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు.

ఇప్పుడు సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. అబ్బాస్ సినిమాల గురించి తప్పా.. అతడి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎవరికి తెలియదు. కానీ అబ్బాస్ భార్య, పిల్లలు మాత్రం చాలా అందంగా ఉంటారు. అబ్బాస్ 1997లో ఏరూమ్ అలి అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఏమిరా అలి, కొడుకు అయమాన్ అలి ఉన్నారు. తాజాగా అబ్బాస్ ఫ్యామీలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా కూతురు ఏమిరా అలి లేటేస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరోయిన్స్ ను మించిన అందంతో.. చూడగానే ఫిదా అయ్యాలా కనిపిస్తుంది. ప్రస్తుత అబ్బాస్ ఫ్యామిలీ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

Abbas Daughter

Abbas Daughter

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments