Friday, December 27, 2024
Google search engine
HomeUncategorizedAarti Agarwal: అలా చేయకుండా ఉండాల్సింది.. ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.....

Aarti Agarwal: అలా చేయకుండా ఉండాల్సింది.. ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్‏గా వెండితెరపై సందడి చేసింది ఆర్తి అగర్వాల్. అందమైన రూపం.. కలువల్లాంటి కన్నులు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇప్పటికీ ఎప్పటికీ సినీ ప్రియుల మనసులలో చెరగని అందమైన రూపం. విక్టరీ వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. తొలి సినిమాతోనే బారీ విజయాన్ని అందుకున్న ఆర్తికి.. ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి. చేతినిండా సినిమాలతో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, ప్రభాస్, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. హీరోయిన్‏గా మెప్పించడమే కాదు.. విలన్ గానూ అదరగొట్టింది.

చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకున్న ఈ హీరోయిన్.. వ్యక్తిగత జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ప్రేమ, పెళ్లి , బ్రేకప్ అంటూ ఎన్నో రూమర్స్ వినిపించాయి. అమే మానసిక ఒత్తిడిలో 2005లో క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత ఏడాది మెట్లపై నుంచి పడిపోయింది. 2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ ను పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. ఇటు సినిమాల్లోనూ అవకాశాలు తగ్గిపోయాయి.

కొన్నాళ్లలకు రీఎంట్రీ ఇచ్చిన పెద్దగా వర్కవుట్ కాలేదు. అప్పటికే బరువు ఎక్కువగా పెరగడంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. బరువు తగ్గేందుకు తీసుకున్న చిన్న నిర్ణయమే ఆమె ప్రాణాలను తీసింది. స్థూలకాయం, శ్యాసకోస సమస్యలతో బాధపడిన ఆర్తి.. 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. కానీ ఆ సర్జరీ ఫెయిల్ కావడంతో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన అందమైన రూపం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments