Sunday, December 29, 2024
Google search engine
HomeUncategorizedAarambham OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఆరంభం ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

Aarambham OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఆరంభం ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

Aarambham OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఆరంభం ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

C/o కంచరపాలెం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు మోహన్ భగత్. ఈ సినిమాలో సహజ నటనతో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మోహన్ భగత్ ప్రధాన పాత్రలో నటించిన మైండ్ బ్లోయింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ ఆరంభం. డైరెక్టర్ అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. టైమ్ ట్రావెల్, డెజావూ అంశాలను అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు మేకర్స్. జూలై 5 అర్దరాత్రి నుంచి ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.

ఆరంభం మూవీలో సుప్రితా సత్యనారాయణ్, భూషణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల కీలకపాత్రలలో నటించగా.. సిన్జిత్ యర్రంమిల్లి సంగీతం అందించారు. ఈ ఏడాది మే 10న అడియన్స్ ముందుకు వచ్చింది. సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రివ్యూస్ రాగా.. కమర్షియల్ హిట్ మాత్రం కాలేదు. ఈ సినిమాతో మోహన్ భగత్ సింగ్ మరోసారి అలరించారు.

కథ విషయానికి వస్తే..
ఓ గ్రామానికి చెందిన మిగిల్ (మోహన్ భగత్) హత్య కేసులో రెండున్నరేళ్లుగా శిక్ష అనుభవిస్తుంటాడు. అతడిని ఊరితీసే సమయానికి ఖైదీ నంబర్ 299 కాలా ఘటి జైలు నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పించుకుంటాడు. ఈ మిస్టీరియస్ ఎస్కేప్ అధికారులను అయోమయానికి గురిచేస్తుంది. ఈ కేసును ఛేదించడానికి ఇద్దరు డిటెక్టివ్ లు వస్తారు. వారి పరిశోధనలో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. అసలు మిగిల్ ఎవరిని హత్య చేసి జైలుకు వచ్చాడు..? అసలు అతడు ఎలా తప్పించుకోగలిగాడు ? అనేవి తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే. టైమ్ ట్రావెల్, డెజావు కాన్సెప్ట్ బ్లెండ్ చేసి మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ చేసే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments