Wednesday, November 20, 2024
Google search engine
HomeUncategorizedAadujeevitham OTT: మూవీ లవర్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.....

Aadujeevitham OTT: మూవీ లవర్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ది గోట్ లైఫ్. తెలుగులో ఆడు జీవితం పేరుతో రిలీజైంది. మార్చిన 28న మలయాళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలైన ఆడు జీవితం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లక పైగా వసూళ్లను రాబట్టింది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఆడు జీవితం సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత నెలలుగా దీనిపై ఒక్క అప్డేట్ రాలేదు. దీంతో మూవీ ఆడియెన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. ఆడు జీవితం సినిమా ఓటీటీలో రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మూడు రోజుల క్రితమే పృథ్వీరాజ్ సినిమా స్ట్రీమింగ్ విషయంపై ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. జులై 19 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ అనౌన్సెమెంట్ ఇచ్చింది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఆడు జీవితం సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్న మాట. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నూ ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

థియేటర్లలో రిలీజైన సుమారు నాలుగు నెలల తర్వాత ఆడు జీవితం సినిమా ఓటీటీలోకి రానుంది. దీంతో మూవీ ఆడియెన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కేరళ నుంచి సౌదీకి వలస వెళ్లిన ఒక కూలీ పడే కష్టాల ఇతి వృత్తంతో దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కు జంటగా అమలా పాల్ కథానాయికగా నటించింది. అలాగే హాలీవుడ్ నటులు జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, ఆల్టా గ్లోబల్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయండి.. ఎంచెక్కా ఇంట్లోని కూర్చొని సినిమాను ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments