Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedKalki 2898 AD: ఇది ప్రభాస్ రేంజ్ అంటే.. వరల్డ్ బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ లో 'కల్కి'...

Kalki 2898 AD: ఇది ప్రభాస్ రేంజ్ అంటే.. వరల్డ్ బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ లో ‘కల్కి’ సినిమా.. ఎక్కడో తెలుసా?

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లు వసూలు చేసింది. 1000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సినిమాకు అరుదైన గౌరవం దక్కనుంది. అదేంటంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద ఐమ్యాక్స్ థియేటర్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ‘కల్కి 2898 AD’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. సైన్స్ ఫిక్షన్ స్టైల్లో ఈ సినిమా రూపొందింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచన జనాలకు నచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితమవుతోంది. అదే విధంగా, ఈ చిత్రాన్ని జూలై 13న కాలిఫోర్నియాలోని TCL చైనీస్ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద IMAX స్క్రీన్‌గా ఖ్యాతిని పొందింది. ఈ స్క్రీన్ పొడవు 27 మీటర్లు. ఈ థియేటర్‌లో మొత్తం 932 మంది కూర్చోవచ్చు. ఈ థియేటర్ వెలుపలి భాగం చైనీస్ శైలిలో ఉంటుంది. ఈ థియేటర్ 1927లో ప్రారంభమైంది. అంటే మరి కొన్నేళ్లలో రంగస్థలం 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పాలుపంచుకోనున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్ తో కల్కి సినిమాను నిర్మించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments