టాలీవుడ్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న భారీ సినిమాలకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు పవర్ స్టార్. రీసెంట్ స్టేట్మెంట్తో తన టైట్ ఫైట్‌లో కాస్త హీట్ తగ్గించారు. ఇంతకీ పవన్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఏంటి..? ఆ ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద ఎలా ఉండబోతోంది..?
పవన్ ఇచ్చిన ఈ స్టేట్మెంటే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు డిసెంబర్ బరిలో పవర్ స్టార్ కూడా ఉంటారన్న ప్రచారం జరిగింది. ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని ఎప్పుడో చెప్పారు మేకర్స్.
కానీ పవన్ లేటెస్ట్ ఎనౌన్స్మెంట్తో ఆ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అసలు సెప్టెంబర్‌లోపు పవన్ సెట్‌కి రానని చెప్పటంతో ఓజీ ఇప్పట్లో లేనట్టే అని డిసైడ్ అయ్యారు ఫ్యాన్స్.
తాజా కామెంట్‌తో హరి హర వీరమల్లు రిలీజ్ విషయంలోనూ క్లారిటీ వచ్చినట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఆ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ పార్ట్ కూడా కొంత మిగిలేది ఉంది.
అది పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేస్తేగానీ రిలీజ్ విషయంలో క్లారిటీ రాదు. పవన్ మూడు నెలల వరకు షూటింగ్‌లు చేయనని చెప్పటంతో హరి హర వీరమల్లు డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్సే లేదని తేలిపోయింది.
పవన్ సినిమాల విషయంలో క్లారిటీ రావటంతో డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న సినిమాలు ఊపిరి పీల్చుకున్నాయి. పుష్ప 2, రాబిన్ హుడ్, తండేల్ సినిమాలు డిసెంబర్ డేట్స్ మీద కర్చీఫ్స్ వేశాయి. మరికొన్ని సినిమాలు ఈ సీజన్లోనే వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా డిసెంబర్లోనే వచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇంత హెక్టిక్‌గా ఉన్న క్యాలెండర్ నుంచి పవన్ మూవీస్ సైడ్ అవ్వటం, మిగతా సినిమాలకు బిగ్ రిలీఫ్ అంటున్నారు క్రిటిక్స్.