Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedTollywood: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఈ బ్యూటీ గుర్తుందా..?

Tollywood: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఈ బ్యూటీ గుర్తుందా..?

సినిమా ఓ రంగుల ప్రపంచం. ఈ సినీ పరిశ్రమలో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కోటి కలలో అడుగుపెడుతుంటారు. ముఖ్యంగా కొత్త హీరోయిన్స్ చాలా మంది వస్తుంటారు. ఒకటి రెండు చిత్రాలతో చాలా ఫేమస్ అయిపోతుంటారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అతి తక్కువ సమయంలోనే కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటారు. కెరీర్ ప్రారంభంలోనే ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటారు. కానీ కొంతమంది ముద్దుగుమ్మలకు ఆ తర్వాత అదృష్టం కలిసి రాదు. ఒక్క సినిమాతో ఫేమస్ అయిపోయి వెంటనే కనుమరుగవుతారు. అందులో పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకరు. అందులో బక్కిచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆ హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది.

పవర్ స్టార్ మూవీతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఎందుకో ఆ తర్వాత ఛాన్సులు రాలేదు. ఆ హీరోయిన్ పేరు సారా జేన్ డయాస్. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు. కానీ పవన్ కళ్యాణ్ నటించిన పంజా మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రివ్యూస్ అందుకుంది. ఇందులో సారా జేన్ కాస్త బొద్దుగా ఎంతో అందంగా కనిపించింది. కానీ పంజా మూవీ తర్వాత సారా తెలుగులో మరిన్ని సినిమాలు చేయలేదు. కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించని సారా.. ఇప్పుడు ఆకస్మాత్తుగా బక్కచిక్కిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

సినిమాలకు దూరంగా ఉన్న సారా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు దగ్గరగా ఉంటుంది. సారా మన దేశ అమ్మాయి కాదు. ఒమన్ దేశానికి చెందిన సారా.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. సినీ అవకాశాల కోసం ముంబైలోకి అడుగుపెట్టిన సారా.. మొదట్లో టీవీ షోలలో కనిపించింది. తర్వాత తమిళంలో ఓ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తెలుగులో పంజా సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత హిందీలో అనేక సినిమాల్లో నటించింది. 2017లో చివరగా ఓ మూవీ చేసిన సారా.. ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తుంది. ప్రస్తుతం సారా వయసు 41 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments