ప్రజెంట్ మన సినిమాల మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అందుకే ఒక సినిమాకు మించి మరో సినిమాకు ఖర్చు పెడుతున్నారు మేకర్స్. ముందు సినిమా లైఫ్ టైమ్ వసూళ్లను మించి నెక్ట్స్ సినిమాకు బడ్జెట్ లాక్ చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాల విషయంలోనే కాస్త ఆలోచిస్తే బెటర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
నాని హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఇదే కాంబినేషన్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నారు నాని. అంతేకాదు నెక్ట్స్ మూవీ బడ్జెట్‌ను దసరా వసూళ్ల కంటె ఎక్కువగా ఫిక్స్ చేశారు మేకర్స్.
నాని మాత్రమే కాదు మంచు విష్ణు కూడా ఇలాంటి రిస్కే చేస్తున్నారు. విష్ణు బ్లాక్ బస్టర్ హిట్ చూసి చాలా రోజులవుతోంది. అయినా తన మార్కెట్ లెక్కలు పట్టించుకోకుండా భారీ బడ్జెట్‌తో కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్స్, బిగ్ టెక్నికల్ వాల్యూస్‌తో సినిమా తెరకెక్కించేందుకు చాలా ఖర్చు చేస్తున్నారు.
తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ఎనౌన్స్ చేసింది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్. కొత్త దర్శకుడితో రూపొందిస్తున్న ఈ సినిమాకు 100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారన్న టాక్ వినిపిస్తోంది. విరూపాక్ష సినిమాతో బిగ్ హిట్ అందుకున్న తేజ్, ఆ తరువాత బ్రో సినిమాతో నిరాశపరిచారు. ఈ టైమ్‌లో సాయి ధరమ్ మీద ఇంత బడ్జెట్ అంటే రిస్కోమే అన్న టాక్ వినిపిస్తోంది.
రీసెంట్గా సుదీర్ బాబు కూడా ఓ పాన్ ఇండియా సినిమాను ఎనౌన్స్ చేశారు. మాస్ యాక్షన్ జానర్లో చేస్తున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను ఫిక్స్ చేశారు. ఇలా యంగ్ హీరోల సినిమాలకు ప్రీవియస్ మూవీస్ వసూళ్లను దాటి బడ్జెట్ కేటాయించటం ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది.