Friday, December 27, 2024
Google search engine
HomeUncategorizedఎన్టీఆర్‌తో సినిమాపై స్పందించిన డైరెక్టర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT...

ఎన్టీఆర్‌తో సినిమాపై స్పందించిన డైరెక్టర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Aug 1, 2024 5:55 PM IST

నేచురల్ స్టార్ నాని, అందాల భామ మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన మూవీ ‘హాయ్ నాన్న’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శౌర్యువ్ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది. ఇక ఈ సినిమాను ఆయన తెరకెక్కించిన తీరుకి సర్వత్రా ప్రశంసలు కురిసాయి. అయితే, గత కొద్ది రోజులుగా ఈ డైరెక్టర్ నెక్ట్స్ మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్‌తో దర్శకుడు శౌర్యువ్ త్వరలో ఓ సినిమాను ప్రారంభించనున్నాడని.. ఈ సినిమాను సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నారనే టాక్ వినిపించింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందనే వార్తలో జోరుగా వినిపించాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా శౌర్యువ్ స్పందించారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రెస్పాండ్ అయ్యారు.

‘‘ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాననే వార్తలో ఎలాంటి నిజం లేదు.. అసలు ఈ పుకారు ఎప్పుడు, ఎలా మొదలైందో తెలియడం లేదు.. కానీ, ఎప్పటికైనా తారక్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నా..’’ అంటూ శౌర్యువ్ తన స్పందన చెప్పుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్-శౌర్యువ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే వార్తకు ఫుల్‌స్టాప్ పడినట్లు అయ్యింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తుండగా, ఈ చిత్రాన్ని రెండు భాగాల్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments