Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedRajamouli: ఓరి దేవుడా.. వీడు హీరోగా దొరికాడేంట్రా అనుకున్నా.. డైరెక్టర్ రాజమౌళి..

Rajamouli: ఓరి దేవుడా.. వీడు హీరోగా దొరికాడేంట్రా అనుకున్నా.. డైరెక్టర్ రాజమౌళి..

ప్రపంచ సినిమా వేదికపై భారతీయ సినిమాను సగర్వంగా నిలబెట్టిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. సౌత్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ తీసుకువచ్చిన జక్కన్న.. బాహుబలి సినిమాతో కొత్త రికార్డులు సృష్టించాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఈ సినిమాతో నార్త్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాల సత్తా చాటాడు. దేశం మొత్తం అలరించే చిత్రాలు కేవలం బాలీవుడ్ నుంచే వస్తాయనే మాట నిజం కాదని నిరూపించాడు. తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ కు పరిచయం చేశాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా సత్తా ఏంటో దేశానికి చూపించారు. కంటెంట్, స్టార్ హీరో అయినా తనదైన శైలిలో సినిమా రూపొందించి.. ప్రేక్షకులకు అద్భుతమైన ఊహలోకానికి తీసుకెళ్లి.. మర్చిపోలేని అనుభూతి పచ్చడంలో ఆయనే శిల్పి. రాజమౌళి సినిమాలో చిన్న రోల్ వచ్చినా చాలు అని ఎంతో మంది హీరోహీరోయిన్స్, ఆర్టిస్టులు ఎదురుచూస్తుంటారు. సినీరంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టి ఇరవై ఏళ్ళే అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం విజయాన్ని మాత్రమే చూశారు. 12 సినిమాలే తెరకెక్కించి కలే అనుకున్న ఆస్కార్ గడ్డపై నాటు నాటు స్టెప్పులేయించాడు.

రాజమౌళి తన సినిమాల్లో ప్రతి పాత్రను చాలా క్షుణ్ణంగా ఆలోచించి చూసుకుంటారు. తను అనుకున్న పాత్రకు ఎవరైతే కరెక్టుగా సెట్ అవుతారో వాళ్లను అచి తూచి తీసుకుంటారు. రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో ట్రిపుల్ ఆర్ మూవీని రూపొందించి స్టివెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజ దర్శకుల మెప్పును పొందారు. ప్రస్తుతం మహేష్ బాబుతో మరో పాన్ ఇండియా మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత అడ్వెంచర్ డ్రామాగా జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే జక్కన్న సినిమాలో నటించాలని ఎంతోమంది నటీనటులు ఎదురుచూస్తుంటారు. కానీ ఓ హీరో విషయంలో రాజమౌళి మనసులో అనుకున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ మాటలను బయటపెట్టింది స్వయంగా జక్కన్న కావడం గమనార్హం.

అతడు మరెవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సినిమా స్టూడెంట్ నెం.1. 2001లో విడుదలైన ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. అయితే తన ఫస్ట్ మూవీలో హీరోగా తారక్ అని.. అతడిని మొదటి సారి చూడగానే “ఓరి దేవుడో.. వీడు దొరికాడేంట్రా.. నా ఫస్ట్ మూవీకి.. మీసాలు సరిగ్గా లేకుండా.. నడక చూసి.. నా ఫస్ట్ మూవీకి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను.. వీడు దొరికాడేంట్రా అనుకున్నా.. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన పది రోజులకే తారక్ యాక్టింగ్ స్కిల్స్, టాలెంట్ చూసి షాకయ్యానని.. ఆ తర్వాత తనతో ఫ్రెండ్షిప్ మొదలయ్యిందని చెప్పుకొచ్చాడు ” రాజమౌళి. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Rajamouli, Ntr

Rajamouli, Ntr

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments