Srinivennela Seetharama Sastry: ఆ పాట రాయడం కష్టమవుతుంది.. మొదటిసారి సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..

0
16
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలను రాశారు రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. మనసుకు హత్తుకునే పాటలతో సినీ సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేశారు. తన సాహిత్యంతో ఎన్నో పాటలకు ప్రాణం పోశారు సిరివెన్నెల. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీతారామ శాస్త్రి, డైరెక్టర్ కృష్ణవంశీలది గురుశిష్యుల బంధం. కృష్మవంశీ తీసిన అన్ని సినిమాల్లో సిరివెన్నెల మార్క్ పాటలు ఎన్నో ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో అనేక ఆణిముత్యాలాంటి పాటలు వచ్చాయి. ప్రతి పాట సందర్భానుసారంగా, అర్థవంతంగా ఉంటాయి. పాటలో జీవితం కనిపించేంత అందంగా ఉంటుంది. సిరివెన్నెల మరణం తర్వాత సినీరంగంలో తాను అనాథను అయిపోయానంటూ ఇటీవల డైరెక్టర్ కృష్ణవంశీ ఎమోషల్ అయ్యారు. అలాగే సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఇటీవల సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ నా ఉఛ్వాసం కవనం అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, డైరెక్టర్స్ హాజరై సిరివెన్నెలతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ.. సిరివెన్నెలతో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. అలాగే తాను తెరకెక్కించిన ఖడ్గం సినిమాలోని ముసుగు వేయొద్దు మనసు మీద పాట రాసినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఖడ్గం సినిమా ఒక ఎమోషన్ అని.. అందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయని అన్నారు.

ముసుగు వెయ్యొద్దు మనసు మీద సాంగ్ పబ్ లాంటి ప్లేస్ లో ఉంటుంది. అలాగే ఆ పాట పబ్ సాంగ్ లా ఉన్నా ఆ లిరిక్స్ చూస్తే చాలా స్పూర్తినిచ్చే పాటల ఉంటుందని.. ఆ పాట రాయమని సిరివెన్నెలను అడిగినప్పుడు తనకు పబ్ లో ఎలా ఉంటుందో తెలియదని.. అందుకే రాయడం కష్టమవుతుందని ఉన్నారట. దీంతో మొదటిసారి సిరివెన్నెలను పబ్ కు తీసుకెళ్లానని.. అక్కడి వాతావరణాన్ని గమనించి ముసుగు వెయ్యొద్దు మనసు మీద అనే పాటను రాసిచ్చారని చెప్పుకొచ్చారు.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here