Nayanathara: నయనతారతో బిగ్‏బాస్ కంటెస్టెంట్ లవ్ స్టోరీ.. పోస్టర్ చూసి షాకవుతున్న నెటిజన్స్.. 

0
17
నయనతారతో బిగ్‏బాస్ కంటెస్టెంట్ లవ్ స్టోరీ.. షాకవుతున్న నెటిజన్స్.

లేడీ సూపర్ స్టార్ నయనతార కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ సొంతం చేసుకున్న నయన్.. ఆ తర్వాత తన నెక్ట్స్ మూవీని ప్రకటించలేదు. కానీ తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది. అటు వెకేషన్స్ ఫోటోస్.. ఇటు తన కాస్మోటిక్ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంటున్న నయన్.. తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించింది. అయితే జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆ తర్వాత మాత్రం బిగ్‏బాస్ కంటెస్టెంట్‏తో సినిమా చేసేందుకు రెడీ అయ్యింది. ఆ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా నుంచి కూల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇన్నాళ్లు స్టార్ హీరోస్ సరసన సందడి చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఉన్నట్లుండి యంగ్ హీరోతో జతకట్టడంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇంతకీ ఎవరంటే.. కోలీవుడ్ యంగ్ హీరో.. కవిన్.

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నయన్.. ఇప్పుడు ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. తెలుగు, హిందీ, తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఏమాత్రం తొందర పడకుండా నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది నయన్. ఇప్పుడు కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ సరసన నటించేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విష్ణు ఎదవన్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ మూవీతోనే దర్శకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. వారం క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా నయన్, కవిన్ మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి నయన్, కవిన్ కు సంబంధించిన కూల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్ ఆశ్యర్యపోతున్నారు. లేడీ సూపర్ స్టార్ ఇలా బిగ్‏బాస్ కంటెస్టెంట్ జోడిగా నటించడం అస్సలు ఊహించలేదని..ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం చాలా ఉందని.. అసలు ఇద్దరితో ఎలాంటి ప్రేమకథ రాబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమిళ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న హీరోలలో కవిన్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన కవిన్.. ఆ తర్వాత తమిళ్ బిగ్‏బాస్ సీజన్ 3లో పాల్గొన్నాడు. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిన్ కు హీరోగా ఆఫర్స్ వచ్చాయి. 2021లో విడుదలైన లిఫ్ట్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన కవిన్.. ఇప్పుడు ఏకంగా నయనతారతో కలిసి లవ్ స్టోరీ చేయనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here