Saniya Iyappan: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా..? ఉన్న అందం పోయింది.. హీరోయిన్‏పై ట్రోల్స్..

0
15
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా..? హీరోయిన్‏పై ట్రోల్స్..

సాధారణంగా సినీ పరిశ్రమలో తమ అభిమాన తారలలో ఏ చిన్న మార్పు కనిపించినా అభిమానులు క్షణంలో గుర్తుపట్టేస్తారు. ముఖం, జుట్టు, నడక ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తారు. కొన్నిసార్లు సెలబ్రెటీలలో వచ్చిన మార్పులను అంతర్జాతీయ సమస్యలుగా భావించి సోషల్ మీడియాలో దారుణంగా విమర్శిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎప్పుడూ సంప్రదాయంగా కనిపించి ఉన్నట్లుండి గ్లామర్ ఫోటోలకు ఫోజులిచ్చినా.. ముఖంలో ఎలాంటి మార్పు వచ్చిన వెంటనే కనిపెట్టేస్తారు. తాజాగా నెట్టింట ఓ హీరోయిన్ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె ప్లాస్టిగ్ సర్జరీ చేయించుకుందా..? ముఖంలో మార్పులు కనిపిస్తున్నాయి.. ఉన్న అందం పోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన పై వచ్చే ట్రోలింగ్స్ ను ఏమాత్రం పట్టించుకోనంటుంది ఆ బ్యూటీ. తనే మలయాళీ హీరోయిన్ సానియా ఇయప్పన్. అటు చీరకట్టులో.. ఇటు మోడ్రన్ దుస్తులలో మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటోషూట్ చేసింది. అయితే ఇందుకోసం సానియా సాధారణం కంటే భిన్నమైన లుక్ లో కనిపించింది. ఆ కవర్ పేజీపై సానియాను చూసిన నెటిజన్స్ ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె ముఖంలో మార్పులు కనిపిస్తున్నాయని.. హెయిర్ స్టైల్ అస్సలు సెట్ కాలేదని, ముక్కు, పెదాలకు ఏదో సర్జరీ చేయించుకుందని.. అందుకే ఆమె సహజ అందం లేకుండా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలా కామెంట్స్ రావడం తనకు మొదటి సారి కాదని.. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ కు సిద్ధపడి వచ్చినట్లు తెలిపింది.

గతంలో తాను పొట్టి దుస్తులు ధరించినప్పుడు కూడా ఇలాగే విమర్శలు చేశారని.. ఇలాంటి కామెంట్స్ తనను ఏమాత్రం ప్రభావితం చేయవని తెలిపింది. అన్నింటికీ సిద్ధపడితేనే సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని తన తల్లి సలహా ఇచ్చిందని.. కుటుంబానికి సౌకర్యంగా ఉన్న దుస్తులు ధరించడంలో ఇబ్బంది లేదు… నెటిజన్లకు ఇబ్బంది ఏంటీ ? అంటూ ప్రశ్నించింది. చాలా చిన్న వయస్సులోనే సెలబ్రిటీగా మారిన సానియా.. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా స్టార్. ప్రేతం, యూనివర్శిటీ, లూసిఫర్, పతితంపాడి, ది ప్రీస్ట్ వంటి సినిమాల్లో సానియా అద్భుతంగా నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here